బిగ్ బాస్ షోలో అభిజిత్ హారిక మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. బయట అభిక (అభిజిత్ హారిక) అంటూ ట్రెండ్ అవుతోంది. పైగా వీరిది క్యూట్ ఫ్రెండ్‌షిప్ అని హారిక సోదరుడు, తల్లి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. అభిజిత్ హారికలు ఇష్టపడితే.. అభిజిత్ ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటే.. పెళ్లి చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన హారిక తల్లి జ్యోతి అభిజిత్‌ను ప్రశంసలతో ముంచెత్తింది.
పదకొండో వారంలో ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ షోలో సందడి చేశారు. అందులో ముఖ్యంగా అభిజిత్, అఖిల్, హారిక ఈ ముగ్గురి తల్లులు ఫేమస్ అయ్యారు. ఈ ముగ్గురు మాట్లాడిన విధానం ఇంట్లో ప్రేమను నింపిన విధానం, పాజిటివిటినీ క్రియేట్ చేసిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఇందులో ఇప్పుడు హారిక తల్లి జ్యోతి, అభిజిత్ అమ్మ లక్ష్మీని ఒకే చోటకు పట్టుకొచ్చాడు యాంకర్ రవి. అభిజిత్ హారిక ఫ్యామిలీలను ఒకే చోటకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసేందుకు రెడీ అయ్యాడు.
రవి తన యూట్యూబ్ చానెల్‌ను ఇలా బిగ్ బాస్ షో ద్వారా బాగానే పాపులర్ చేసుకుంటున్నాడు. ట్రెండింగ్‌లో ఉన్న బిగ్ బాస్ షో గురించి ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అభిజిత్ తనకు కజిన్ బ్రదర్ అవుతాడని, తన సపోర్ట్ అతనికే ఉంటుందని రవి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హారిక, అభిజిత్ మదర్స్‌తో రవి ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు. కచ్చితంగా ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.