ఆమె ఓన్లీ అవే చూస్తుంది.. ఆ నటి గుట్టు విప్పిన సమీర్!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ అందరి గురించి తెలిసిందే. అతను తెరపై మాత్రమే అంతటి గంభీరంగా కనిపిస్తాడు. కానీ నిజ జీవితంలో ఎంతో సరదాగా ఉంటాడు. బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోల్లో ఎంతగా సందడి చేస్తాడో, పంచ్‌లు వేస్తుంటాడో అందరికీ తెలిసిందే. ఆ మధ్య క్యాష్ షోలో సుమను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. వరుసగా పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయించాడు. తాజాగా మరోసారి అందర్నీ నవ్వించేందుకు రెడీ అయ్యాడు.

Sameer Satires On Jyothi In Wow 3 Show
Sameer Satires On Jyothi in Wow 3 Show

వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో అంటూ సాయి కుమార్ ఒకప్పుడు బుల్లితెరపై రచ్చే చేశాడు. తాజాగా వావ్ మూడో సీజన్ ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్లందరినీ గెస్ట్‌లుగా తీసుకొచ్చి బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు. వచ్చే వారం ఎపిసోడ్‌కు సంబధించిన ప్రోమోను తాజాగా బయటకు వచ్చింది. వచ్చే వారం షోలో గెస్ట్‌లుగా సమీర్, నటి జ్యోతి, ప్రభాస్ శీను, మహేష్ ఆచంట వచ్చారు. ఇక సాయి కుమార్ వీళ్లందరితో బాగానే ఆడించాడు.

మరీ ముఖ్యంగా సమీర్‌తో ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. సమీర్ నువ్ బాగా.. అంటూ సాయి కుమార్ గ్యాప్ ఇవ్వడంతో అందరూ నవ్వేశారు. రాత్రి ఒంటి గంట తరువాత కూడా ఫోన్‌లు చేస్తున్నావట.. అని సాయి కుమార్ అనడంతో చేయాల్సి వస్తుందట అని సమీర్ సెటైర్ వేశాడు. సినిమాలు బాగా చూస్తావ్ కదా.. పర్టిక్యులర్‌గా ఇవే అంటూ ఏమైనా చూస్తావా లేదా అన్నీ చూస్తావా? అని సాయి కుమార్ సమీర్‌ను ప్రశ్నించాడు. ఆ వెంటనే సమీర్ స్పందిస్తూ.. అన్నీ అని సమాధానం ఇవ్వడంతో పక్కనే ఉన్న జ్యోతి అన్నీ అంటే ఏంటి అని కౌంటర్ వేయడంతో అందరూ నవ్వేశారు. ఆ వెంటనే సాయి కుమార్ జ్యోతిని నువ్ ఏం చూస్తావ్ అని అడగడంతో.. వెంటనే సమీర్ స్పందించాడు. ఓన్లీ అవే అంటూ కౌంటర్ వేయడంతో జ్యోతి కొట్టేందుకు వచ్చింది. ఇలా ఎపిసోడ్ మొత్తం బాగానే ఫన్ క్రియేట్ అయినట్టు కనిపిస్తోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles