తిరుమల సాక్షాత్తు కలియుగ వైకుంఠం. ఇక్కడి ఆనందనిలయంలోని శ్రీవారికి ప్రతినిత్యం అనేక కైంకర్యాలు. అనేక విశేష అర్చనలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల పవిత్రవేళ ఆ సేవలలో ఒకటైన
తోమాలసేవ గురించి తెలుసుకుందాం…
సుప్రభాత సేవతో నిద్ర నుంచి మేల్కొలిపిన తర్వాత స్వామి వారికి నిర్వహించే సేవ ఇది. తోమాల అంటే పూల దండ. రకరకాల పూలు, తులసి దళాలతో కట్టిన దండను స్వామి వారికి అలంకరిస్తారు. యమునాదురై నుంచి పూల దండలను ఆలయానికి చెందిన పెరియ జీయర్ తీసుకుని వస్తారు. వాటితో సేవ జరుగుతుంది. ఈ సేవ సమయం 30 నిమిషాలు. ఈ సేవ మంగళ, బుధ, గురువారాల్లోనే జరుగుతుంది.