ఇంటి పూజ గదిలో పొరపాటున కూడా ఇలాంటి వస్తువులు ఉంచరాదు…?

సాధారణంగా ప్రతీ ఇంట్లో పూజగది ఉంటుంది. ఈ పూజ గదిని చాలా పవిత్రంగా భావిస్తారు. స్నానం చేయకుండా పూజ గదిలోకి అడుగు కూడా పెట్టరు. ఇలా ఎంతో పవిత్రంగా భావించి పూజ గదిలో దేవుడి విగ్రహాలు ఫోటోలు ఉంచి పూజించటం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అయితే చాలామంది తెలిసి తెలియక పూజ గదిలో కొన్ని రకాల వస్తువులను ఉంచుతూ ఉంటారు. ఈ వస్తువుల వల్ల ఆ ఇంట్లో సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎంతో పవిత్రంగా భావించే పూజ గదిలో ఏ వస్తువులను ఉంచుకోవాలి? ఏ వస్తువులను ఉంచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా పూజ గదిలో దేవుడి విగ్రహాలను, దేవుడి ఫోటోలు ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభించి కుటుంబ సభ్యులు అందరూ సుఖసంతోషాలతో ఉంటారని ప్రజల విశ్వాసం. అయితే కొంత మంది వారికి తెలియకుండా ఇంట్లో ఎక్కువ సంఖ్యలో దేవుడి విగ్రహాలు ఉంచి పూజిస్తారు. అయితే ఒకటికన్నా ఎక్కువ దేవుడి విగ్రహాలు పూజగదిలో పెట్టీ పూజించటం మంచిది కాదని మత గ్రంథాలలో వివరించబడింది. అలాగే పూజ గదిలో దేవుడు ఫోటోలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే దేవుళ్ళు ముగ్గురు రూపంలో ఉన్న ఫోటోలు కాకుండా సౌమ్యంగా ఉన్న ఫోటోలు మాత్రమే ఉంచి పూజించాలి.

అంతేకాకుండా చాలామంది దేవుడి గదిలో పగిలిన దేవుడి ఫోటోలను విరిగిపోయిన విగ్రహాలను ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇలా పెరిగిపోయిన విగ్రహాలను ఫోటోలను దేవుడి గదిలో ఉంచి పూజించడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల అలా విరిగిపోయిన దేవుడు విగ్రహాలతో ఏదైనా గుడిలో కానీ చెట్టు కింద కానీ పెట్టాలి. అలాగే చనిపోయిన కుటుంబ సభ్యులను దేవుడితో సమానంగా భావించి కొంతమంది వారి ఫోటోలను దేవుడు గదిలో ఉంచి ఆ ఫోటోలకు పూజ చేస్తూ ఉంటారు. ఇలా దేవుళ్ళ ఫోటోలతో సమానంగా చనిపోయిన వారి ఫోటోలకు పూజ చేయడం వల్ల అరిష్టం కలుగుతుంది.