తిరుమల, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలను అక్టోబరు 15న గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనుల వారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం చేపడతారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స వాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.