తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పరిమిత సంఖ్య గల భక్తులతో ఈ బ్రహ్మోత్సవాల వాహనసేవల ఊరేగింపు నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. వాహనసేవల వివరాలు ….
15.10.2020 – గురువారం – అంకురార్పణ – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
16.10.2020 – శుక్రవారం – బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 నుండి 11 గంటల వరకు.
పెద్దశేష వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
17.10.2020 – శనివారం – చిన్నశేష వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
హంస వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
18.10.2020 – ఆదివారం – సింహ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
19.10.2020 – సోమవారం – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
సర్వభూపాల వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
20.10.2020 – మంగళవారం – మోహినీ అవతారం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
గరుడసేవ – రాత్రి 7 నుండి 12 గంటల వరకు.
21.10.2020 – బుధవారం – హనుమంత వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
పుష్పకవిమానం- సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు.
గజ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
22.10.2020 – గురువారం – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు
చంద్రప్రభ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
23.10.2020 – శుక్రవారం – స్వర్ణ రథోత్సవం- ఉదయం 8 గంటలకు.
అశ్వ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
24.10.2020 – శనివారం – పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 3 నుండి 5 గంటల వరకు.
స్నపనతిరుమంజనం, చక్రస్నానం – ఉదయం 6 నుండి 9 గంటల వరకు.
బంగారు తిరుచ్చి ఉత్సవం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
అక్టోబర్ 24తో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.