శివ.. శుభం, మంగళకరం. మహాదేవుడు.. భోలా శంకరుడు. ఆయన్ను ఆరాధించాలంటే కేవలం చిత్తం ఉంటే చాలు. అయితే శివలింగాన్ని మట్టితోపాటు అనేక పదార్థాలతో తయారుచేయవచ్చు. ఏ పదార్థంతో చేస్తే ఏం ఫలితమో తెలుసుకుందాం.. ఏ పదార్థముతోనైనా లింగమును తయారు చేసి పూజ చేయవచ్చు. ఐతే ఒక్కో యుగానికి ఒక్కో పదార్థంతో చేసిన లింగారాధన అతి శీఘ్ర ఫలితాలను ఇచ్చేదానిగా ఆపదార్థాన్ని ఉత్కృష్టమైనదానిగా గుర్తించారు దానిని వ్యాసులవారు పురాణాలలో పేర్కొన్నారు. ఒక్కొక్క పదార్థంతో చేసిన లింగం ఒక్కో ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. ఆ విశేషాలు తెలుసుకుందాం…
పాదరసలింగంతో చేసిన లింగములను పూజించవచ్చు. దోషం ఏమీలేదు. యుగంతో సంబంధంలేకుండా ఎప్పుడూ గొప్ప ఫలితాలనిచ్చే లింగం సువర్ణ లింగం. అందరికీ అలా చేయడానికి తగిన ఆర్థిక స్థితి ఉన్నదో లేదో అని లింగార్చన మంత్రాలలో ఒక మంత్రం ఉంది (” సువర్ణాయనమః సువర్ణలింగాయనమః”) దాని ద్వారా నీ ఎదురుగా నీవు పూజచేసే లింగం సువర్ణ లింగమనే మానసిక భావనతో చేయలి.
శివలింగాల రకాలు..
సువర్ణ లింగం, స్ఫటిక లింగం, పాదరస లింగం, సైకత లింగం (సకల ఐశ్వర్యములనిచ్చును), పార్థివలింగం / మృత్తికాలింగం, సాలగ్రామ లింగం (గండకి నదిలోనే దొరుకుతాయి), బాణ లింగం (నర్మదాశిలలతో చేసినది), గంగా లింగం (గంగానది శిలలతో చేసినది), చందన లింగం (వంశ వృద్ధికారకం), పుష్పలింగం, ధధిలింగం (ఐశ్వర్య హేతువు), ఆజ్యలింగం
ఇంకా లోహములతో (వెండి, రాగి, ఇత్తడి వగైరాలు) మొదలైనవి వున్నాయి. ఏ పదార్థంతో చేసిన లింగమైనా అర్చన సమయంలో చాలా జాగ్రత్తగా భిన్నముకాకుండా అర్చన చేయాలి. శుభ్రత, చిత్తశుద్ధితో శివారాధన చేస్తే ఆ మహాదేవుడి అనుగ్రహం తొందరగా లభిస్తుంది.