మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. అలాగే దేవుడితోపాటు కొన్ని రకాల మొక్కలకు ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. హిందూ సంస్కృతిలో వేప, తులసి, జిల్లేడు మొక్కలను పరమ పవిత్రంగా భావించి వీటికి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కను మాత్రం ఇంట్లో ఉంచుకొని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తులసి మొక్క ముందు దీపాలు వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా తులసి మొక్కను పూజించటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రజల విశ్వాసం. ప్రతిరోజు తులసి మొక్కను పూజించటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుందని ప్రజల నమ్మకం.
అందువల్ల ప్రతిరోజు సాయంత్రం వేళల్లో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించడమే కాకుండా తులసి మాతకు నైవేద్యాన్ని కూడా సమర్థిస్తూ ఉంటారు. అయితే చాలామంది వారి సమస్యలను అధిగమించడానికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు. అలాకాకుండా తులసిమాతను పూజించటం వల్ల తొలగిపోయి అదృష్టం వరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అదృష్టం వరించటానికి తులసీ మాతను ఎలా పూజించాలి..? ఏలాంటి నివారణలు చేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతిరోజు ఉదయం తులసి చెట్టు ఎదురుగా నైవేద్యం సమర్పించి దీపం వెలిగిస్తూ ఉంటారు. అలాగే సంధ్యా సమయంలో కూడా తులసి చెట్టు ఎదురుగా దీపం వెలిగించి పూజిస్తూ ఉంటారు. అయితే ఇలా దీపం వెలిగించే సమయంలో ప్రతిరోజు పిండితో తయారుచేసిన ప్రమిదలో నెయ్యి వేసి అలాగే అందులో చిటికెడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే తులసి చెట్టుకు నైవేద్యంగా బెల్లం పెట్టడం వల్ల ఆ మహావిష్ణువు అనుగ్రహం లభించి సిరిసంపదలకు కొదువ లేకుండా ఉంటుందని జ్యోతిషశాస్త్రాన్ని పునరులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పరమ పవిత్రమైన తులసి మాలను మహావిష్ణువుకు సమర్పించి పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.