దేవునికి చేసే నమస్కారాలలో అనేక రకాలు. సాష్టాంగం, అర్థసాష్టాంగం, నమస్కారం, యోగ నమస్కారం ఇలా అనేక రకాలు. అయితే ముఖ్యంగా భక్తులు దేవాలయంలో ఎక్కువగా సాష్టాంగ చేస్తుంటారు. అయితే ఎక్కడపడితే అక్కడ చేస్తే దోషాలు. కాబట్టి దేవాలయలో ఎక్కడ సాష్టాంగం చేయాలి. ఆ విశేషాలు తెలుసుకుందాం… దైవానికి ఎదురుగా చేతులు సాచి దేహాన్ని పూర్తిగా నేలకి తాకిస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అయితే సాష్టాంగ నమస్కారం ధ్వజ స్థంభం దగ్గరే చేయాలనే నియమమొకటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది.
సాష్టాంగ నమస్కారం ధ్వజ స్థంభం దగ్గర చేయడం వలన, ఆ నమస్కారం తప్పకుండా ప్రధాన దైవానికి చేరుతుంది. అంతే కాకుండా సాష్టాంగ నమస్కారం కోసం బోర్లా పడుకున్నప్పుడు కాళ్ల భాగం దిశలో ఎలాంటి దేవతా మూర్తులు వుండవు. ఆలయంలోని ముఖ మంటపంలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు. కాళ్లు .. ఆ దైవం వాహనం వైపుకు వస్తాయి. కొన్ని ఆలయాల్లో ముఖ మంటపంలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కాళ్లు ఉపాలయాల వైపు ఉంటాయి. అందువల్లనే ఎలాంటి దైవ సంబంధమైన వాహనాల వైపు .. ఉపాలయాల వైపు కాళ్లు పెట్టకుండా ఉండటం కోసం, ధ్వజ స్థంభం దగ్గర నిర్దేశించిన ప్రదేశంలోనే సాష్టాంగ నమస్కారం చేయవలసి ఉంటుంది.
‘‘మనసా, వచసా, కర్మనా సాష్టాంగం చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది.