శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామికి పవిత్రోత్సవాలు !

తిరుమల తిరుపతి, టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నవంబరు 11 నుండి 13వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం నవంబరు 10న రాత్రి 7 గంటలకు మృత్సం గ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు. సంవత్సరం పొడవునా ఆలయంలో జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవా యితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా మొదటిరోజైన నవంబరు 11న పవిత్రప్రతిష్ఠ, రెండో రోజు నవంబరు 12న పవిత్ర సమర్పణ, చివరిరోజు నవంబరు 13న పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపడతారు. పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 11 నుండి 13వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.