రామకోటి రాయడానికి నియమాలు ఇవే !

రామకోటి రాయడమనేది ఒక మంచి ఆలోచన. ఇలా రాయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి. అయితే రామకోటిని రాయడానికి ముందు కొన్ని నియమాలను పాటించాల్సి వుంటుంది. ఎలాపడితే అలా, ఎక్కడబడితే అక్కడ రాయకుండా… భక్తిశ్రద్ధలతో ఒక క్రమబద్ధమైన ప్రణాళికలను ఏర్పరుచుకుని రాస్తే.. చాలా మంచిది.
రామకోటి రాయడానికి నియమాలు ఇవే !

rules to write rama koti
rules to write rama koti

రామకోటి.. సాధారణంగా పెద్దలు ముఖ్యంగా వయస్సు మీదపడ్డవారు ఎక్కువగా రామకోటి రాస్తుంటారు.కానీ నిజానికి అది చిన్నప్పటి నుంచే రాస్తే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. సరే ఇక రామకోటి రాయడానికి ఉండే నియమాలు తెలుసుకుందాం… రామకోటి రాయాలన్న ఆలోచన మీకు వచ్చి వెంటనే ముందుగా భక్తితో దేవుడి దగ్గర సంకల్పం చేసుకోవాలి. అప్పుడు మానసికంగా ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా హాయిగా అనిపిస్తుంది.
– ‘శ్రీరామ’ అని రాయడానికి వీలుగా కోటి గళ్లున్న పుస్తకాన్ని కొనుక్కోవాలి. ఇలా కుదరని పక్షంలో మీరే తెల్లకాగితాలతో ఒక పుస్తకాన్ని తయారుచేసుకుని, అందులో రాసుకోవచ్చు.
– రామకోటి మొదలుపెట్టడానికి ముందు శాస్త్రాల ప్రకారం ఒక మంచి సమయాన్ని కేటాయించుకోవాలి. మీరు రాయ దలచిన పుస్తకానికి పసుపు, కుంకుమను రాసి… దేవుని సన్నిధిలో శ్రీరామ అష్టోత్తరశతనామావళితో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఆ తరువాత పుస్తకంలో రాయడానికి పూనుకోవాలి.
– రామకోటి పుస్తకం రాయడం మొదలుపెట్టిన తరువాత మనసులో ఎటువంటి ఆలోచనలు, చింతలు పెట్టుకో కుండా.. దేవుని మీద భక్తితో, ఏకాగ్రతతో మనసును కేంద్రీకరించి రాయాలి. పుస్తకం రాస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా అవసరమైన పని వచ్చినప్పుడు సరిసంఖ్యలో పుస్తకాన్ని ఆపి వెళ్లాలి. తిరిగి ప్రారంభించడానికి ముందు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోని మొదలుపెట్టాలి.

rules to write rama koti
rules to write rama koti

– రామకోటి పుస్తకం రాయడానికి ఉపయోగించే కలాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టుకోవాలి. ఎక్కడబడితే అక్కడ పడివేయకూడదు. అదేవిధంగా పుస్తకంలో ఇతర విషయాల గురించి రాయకూడదు. పుస్తకాన్ని బలవం తంగా రాయకూడదు. మీకు రాయాలనే సంకల్పం కలిగిన ప్పుడే దానిని పూర్తి చేయగలరు. అలా రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ వుండదు. అయితే పవిత్రత మాత్రం తప్పక పాటించాలి. రామకోటి రాస్తున్న పుస్తకంలో ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, నివేదన చేసుకోవాలి. తరువాత అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. రామకోటి పుస్తకం రాయడం పూర్తయిన తరువాత పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేసుకోవడం మంచిది. ఆశించిన ఫలితాలు సమకూరుతాయి. ఇలా ఈ విధంగా రామకోటి పుస్తకం పూర్తయిన తరువాత పుస్తకాన్ని ఏదైనా రామునిగుడిలో ఆధ్యాత్మిక వ్యక్తికి అప్పగించాలి.