శివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు, ఉపవాస సమయాలు..?

మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పవిత్రమైన మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రి రోజున భక్తులు ఉపవాస దీక్షలు,జాగరణ చేసి నిత్యం శివనామ స్మరణ చేస్తూ శివుని అనుగ్రహం పొందుతారు. అయితే ఉపవాసం చేసే వారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలియక చేసే పొరపాట్ల వల్ల పూజా ఫలితం లభించదు. అందువల్ల శివరాత్రి రోజున భక్తులు పాటించవలసిన ఉపవాస నియమాలు, సమయాల గురించి ప్రముఖ పండితులు తెలిపారు. మహాశివరాత్రి ఉపవాస సమయాలు, నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శివరాత్రి రోజున నియమ నిష్ఠలతో ఉపవాస దీక్ష చేసి శివుడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అందువల్ల భక్తులు శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటిస్తూ ఉపవాస దీక్ష చేయాలి. ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ శనివారం రోజున శనిత్రయోదశి నాడు శివరాత్రి పండుగ జరుపుకుంటారు . ఈ రోజున సూర్యోదయం కాకముందే ఉపవాస దీక్ష ప్రారంభించాల్సి ఉంటుంది. శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందు ప్రారంభమైన ఉపవాస దీక్ష వరసటి రోజు సూర్యోదయం అయిన తర్వాత ముగుస్తుంది. ఉపవాస దీక్ష చేసేవారు పాలు, పండ్లు వంటి అల్పాహారం మాత్రమే తీసుకొని ఉపవాస దీక్ష చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ ఉపవాసంతో పాటుగా మహా శివరాత్రి రోజున శివుడిని నాలుగు దశల్లో పూజించటం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు. అలా పూజించటం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది . శివరాత్రి రోజున పరమేశ్వరుడిది పూజించవలసిన ఆ నాలుగు దశల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• మెుదటి ప్రహర పూజ సమయం ఉదయం 06:40 ప్రారంభించి 9:47 వరకు చేయాలి.
• ఇక రెండవ ప్రహర పూజా సమయం 9:47 నుంచి 12:53 వరకు కొనసాగించాలి.
• అనంతరం మూడవ ప్రహర పూజా సమయం 12:53 నుంచి 4:00 వరకు చెయ్యాలి.
• నాలుగవ పూజను 4:00 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు భక్తి శ్రద్దలతో శివనామ స్మరణ చేస్తూ శివున్ని పూజించి ఆయన అనుగ్రహం పొందాలి.