రుద్రాక్షలను ధరించేవారు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు..?

జ్యోతిష్య శాస్త్రంలో రుద్రాక్షలను పరమ పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా ఆ పరమశివుడికి ప్రతిరూపంగా కూడా భావిస్తారు. ఆ పరమేశ్వరుని ప్రతిరూపమైన రుద్రాక్షను ధరించటం వల్ల ఆ శివుడి అనుగ్రహం లభించడమే కాకుండా అనేక సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. అయితే ఈ పరమ పవిత్రమైన రుద్రాక్షలను ధరించేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. రుద్రాక్షలను ధరించిన వారు పొరపాటున కూడా ఈ నియమాలు ఉల్లంఘించడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. రుద్రాక్షలను ధరించేవారు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం.

• సాధారణంగా కొంతమంది రుద్రాక్షలను మాలగా ధరిస్తూ ఉంటారు. అయితే ఇలా రుద్రాక్షలను ధరించాలని భావించేవారు వారి రాశిని బట్టి రుద్రాక్షలను ధరించాల్సి ఉంటుంది. ఇలా వారు జన్మించిన రాశి ప్రకారం ఏ రుద్రాక్షలను ధరించాలి తెలుసుకొని ఆ రుద్రాక్షలను ధరించాలి.

• సాధారణంగా దేవుడి మాలలు వేసినప్పుడు రుద్రాక్షలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అయితే ఇలా రుద్రాక్ష మాలను ధరించేవారు రాత్రివేళ నిద్రించే సమయంలో రుద్రాక్ష మాలను అలాగే ధరించి నిద్రపోవటం వల్ల అవి అపవిత్రం అవుతాయి. అందువల్ల పరమ పవిత్రమైన ఈ రుద్రాక్షలను నిద్రించే సమయంలో తీసి ఉదయం స్నానం ఆచరించిన తర్వాత మళ్లీ ధరించాలి.

• అలాగే పవిత్రమైన రుద్రాక్ష మాలను ధరించిన వారు పొరపాటున కూడా ధూమపానం, మద్యం, మాంసం సేవించరాదు. శివునికి ప్రతిరూపంగా భావించే ఈ రుద్రాక్షమాలను ధరించి మాంసం, మద్యపానం తీసుకోవటం వల్ల ఆ శివుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

• అలాగే అప్పుడే జన్మించిన పిల్లలకు మరియు బాలింతలకు రుద్రాక్షలు వేయరాదు. ఎందుకంటే ఆ సమయంలో వారు మైలలో ఉంటారు. ఇలా రుద్రాక్ష మాలలు ధరించాలని భావించేవారు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.