108 సంఖ్యకు ఎందుకు ప్రాధాన్యం…?

priority of number 108 as devotional

108.. హిందూ ధర్మంలో ఈ సంఖ్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకు విశేషాలు తెలుసుకుందాం… మన ప్రాచీన ఋషులు గొప్ప గణాంకవేత్తలు, నిజానికి మన సంఖ్యా వ్యవస్థను గుర్తించినది వారే. ఈ సంఖ్యకు ప్రాధాన్యాన్ని వారే సంతరించి పెట్టారు. పూర్తిస్థాయి మనుగడకు 108 సంఖ్య ప్రాధాన్యతను వహిస్తుంది. తొమ్మిది సంఖ్యకు పరిపూర్ణత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 108ని కూడితే వచ్చేది తొమ్మిది. అంతేకాదు ఏ సంఖ్యను 9 సార్లు హెచ్చించి, కూడినా వచ్చే సంఖ్య తొమ్మిదే. తొమ్మిది గ్రహాలు 12 రాశుల ద్వారా ప్రయాణిస్తాయి. వాటిని గుణించగా అంటే 9 x 12 = 108 వస్తుంది. 27 నక్షత్రాలలో ఒక్కోదానికి నాలుగు పాదాలుంటాయి. 27 నక్షత్రాలు అగ్ని, భూమి, గాలి, నీరు అన్న నాలుగు అంశాలపై విస్తరించి వుంటాయి. అంటే 27 x 4 = 108.

priority of number 108 as devotional
priority of number 108 as devotional

ప్రాచీనకాలం నాటి తాళపత్ర గ్రంథాల్ని అనుసరించి విశ్వం 108 అంశాల కలయికతో ఏర్పడింది.
అందుకే పూజలలో అష్టోతర శతనామావళి పూజ చేస్తారు. ఇలా నూటా ఎనిమిది నామాలతో ఆయా దేవతామూర్తులను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.