కార్తీకం.. ఈసారి విశేషం ప్రారంభం, పౌర్ణమి, అమావాస్య సోమవారాలే!

శ్రీశార్వరీ నామసంవత్సరం కార్తీక మాసం చాలా విశేషమైనది. ఈ కార్తీక మాసం సోమవారంతోనే ప్రారంభం అయింది. ఈ మాసంలో అరుదుగా 5 సోమవారాలు వస్తున్నాయి. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్య కూడా కలిసి రావటం మరో ప్రత్యేకత.

Of Poornima and Amavasya- The New Indian Express
కార్తీకమాసం నవంబరు 16 సోమవారంతో ప్రారంభమైంది.
నవంబరు 23 రెండోసోమవారం కార్తీక నవమి. ఇక మూడో సోమవారం నవంబర్‌ 30న పౌర్ణమి నాడు వచ్చింది.
కార్తీక పౌర్ణమి. కృత్తిక నక్షత్రంతో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఉంటుందని పండితులు పేర్కొన్నారు. 30వ తేదీ ఉదయం నుంచి ఉపవాసం ఉండి, కార్తీక దామోదరుడిని పూజించి 365 ఒత్తులు వెలిగించి చంద్రుని దర్శనమైన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. అంతేకాకుండా కొత్తగా పెళ్లయిన అమ్మాయితో 33 పున్నమి నోములు చేయిస్తారు. ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడిపండు, కంద, పసుపు మొక్కతో పాటు స్వయంపాకం ఇప్పిస్తారు. నాల్గో సోమవారం డిసెంబర్‌ 7న వస్తుంది. ఇక చివరిది ఐదో సోమవారం డిసెంబర్ 14వ తేదిన వస్తుంది. ఈరోజు శివాభిషేకాలు, గౌరీనక్తం ఆచరిస్తారు. తర్వాత పోలి స్వర్గం కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య వెళ్లిన మరుసటి రోజున పోలిస్వర్గం పూజలు చేస్తారు. ఇలా ఈసారి ఐదు సోమవారాలతో కార్తీకమాసం విశేషాన్ని సంతరించుకుంది.