మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మనం ఆచార వ్యవహారాలను ఎలా నమ్ముతామో అదే విధంగా వాస్తు శాస్త్రాన్ని కూడా అదే విధంగా నమ్ముతాము.ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో తాబేలు విగ్రహం ఉంచడం ఎంతో శుభ పరిణామంగా భావిస్తారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి కూర్మావతారం ధరించడం వల్ల ఎన్నో విజయాలను పొందారని చెబుతుంటారు. ఈ క్రమంలోనే తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం ఎంతో శుభ పరిణామంగా భావిస్తారు.
ఈ విధంగా ఇంట్లో తాబేలు బొమ్మను ఉంచడం ఎంతో శుభసూచికం అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మను ఏ దిశలో ఉంచడం వల్ల శుభం కలుగుతుంది ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతుందనే విషయానికి వస్తే…తాబేలు విగ్రహాన్ని మన ఇంట్లో సరైన దిశలో పెట్టడం వల్ల కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరగడమే కాకుండా ఆర్థిక ఎదుగుదలకు కూడా ఉంటుంది.అందుకే తాబేలు విగ్రహాన్ని ఎల్లప్పుడూ పూజ మందిరంలో లేదా ఉత్తర దిశ వైపు ఉంచడం శుభసూచకం.
ఉత్తర స్థానం కుబేర స్థానం కుబేరుడు ధనానికి అధిపతి కనుక తాబేలు విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇక ఒక ప్లేటులో నీటిని పోసి తాబేలు విగ్రహాన్ని అందులో ఉంచాలి. తాబేలును క్రిస్టల్ తాబేలు లేదా ఇత్తడితో తయారు చేసిన తాబేలు తీసుకురావడం ఎంతో మంచిది.ఇంట్లోనే కాకుండా వ్యాపారాలు చేసే చోట కూడా ఇలాంటి తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల వ్యాపారంలో దినదినాభివృద్ధి కలుగుతుంది.అయితే ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచేవారు పొరపాటున కూడా ఈ విగ్రహాన్ని పడక గదిలో ఉంచకూడదు.