మన హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా నూతన గృహాలను నిర్మించుకొనే సమయంలో వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం వల్ల అనేక సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులను కూడా వాస్తు ప్రకారం వల్ల అమర్చుకోవటం వల్ల కూడా అనేక సమస్యలు దూరం చేయవచ్చునని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు మనం పెంచుకొని కొన్ని రకాల మొక్కలు కూడా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి.
ఉదాహరణకు పరమ పవిత్రమైన తులసి మొక్కను ఇంట్లో ఉంచి ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు. అందువల్ల తులసి మొక్కను కూడా వాస్తు ప్రకారం ఉంచి పూజలు చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో మనీ ప్లాంట్ ని కూడా పెంచుతూ ఉంటారు. ఈ మనీ ప్లాంట్ ని పెంచుకునేటప్పుడు కూడా వాస్తు ప్రకారం చాలా నియమాలు పాటించాలి. వాసు నియమాలు పాటించకుండా ఎక్కడపడితే అక్కడ మనీ ప్లాంట్ పెంచడం వల్ల కుటుంబంలో కలహాలు ఆర్థిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
మనీ ప్లాంట్ పెంచుకునేవారు పాటించవలసిన నియమాలు :
• ప్రధానంగా ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవాలని భావించేవారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ మొక్కను నాటాలి.
• అంతేకాకుండా ఈ మొక్కను ఇంటి బయట కాకుండా ఇంటి లోపల మాత్రమే పెంచుకోవాలి. మనీ ప్లాంట్ ని ఇంటి బయట పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
• అంతేకాకుండా ఇంట్లో పెంచుకున్న మనీ ప్లాంట్ ఎప్పటికీ వాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనీ ప్లాంట్ వాడిపోతే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి.
• అలాగే మనీ ప్లాంట్ ని పొరపాటున కూడా ఎవరికి దానం చేయకూడదు. ఈ మొక్కను ఇతరులకు దానం చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోయి ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.