కార్తీక గురువారం చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు.. సంపద మీ వెంటే?

తెలుగు మాసాలలో కార్తీకమాసానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. కార్తీకమాసంలో పెద్ద ఎత్తున భక్తులు ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఇలా కార్తీకమాసం మొత్తం పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగిస్తూ శివకేశవులను ఆరాధించడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని భావిస్తారు. ఈ క్రమంలోనే కార్తీక గురువారం రోజు చిటికెడు పసుపుతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అన్ని శుభ పరిణామాలే కలుగుతాయి. మనం ఎంత కష్టపడి సంపాదించిన సంపద చేతిలో నిలబడకపోతే ఈ పరిహారం చేయడం వల్ల మన ఇంట సంపద పెరుగుతుంది.

కార్తీక గురువారం రోజున చిటికెడు పసుపుతో రహస్యంగా ఎవరికి తెలియకుండా మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల మనకు ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు కూడా సకాలంలో పూర్తి అవుతాయి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.అలాగే మనం ఇల్లు శుభ్రం చేసే సమయంలో చిటికెడు పసుపు ఆ నీటిలో వేసుకుని ఇంటిని శుభ్రం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా కుటుంబ సభ్యులు మొత్తం ఎంతో సుఖసంతోషాలతో ఉంటారు.

ఈ విధంగా పసుపుతో 11 లేదా 21 గురువారాలు చేస్తే గురు గ్రహ ప్రభావం మనపై ఉంటుంది. గురు గ్రహం బలం మనపై ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, మన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల నుంచి బయటపడవచ్చు. పసుపుతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.