హిందూ సాంప్రదాయంలో సకల దేవత గణములకు వినాయకుడు అధిపతి. గణపతి, గణేశుడు గణనాయకుడు, అన్ని అడ్డంకులు తొలగించువాడు విఘ్నేషుడు. అన్ని కార్యాలకు అన్ని పూజలకు మొదట పూజలు అందుకుంటాడు. చదువు జ్ఞానానికి, విజయానికి ప్రతీక వినాయకుడు.
వినాయకుడిని పూజించి ఏదైనా కార్యం తలపెడితే అది పూర్తి కావడమే కాక అందులో ఎటువంటి ఆటంకులు అడ్డంకులు ఉండవు. వినాయకుడు త్వరగా అనుగ్రహించే దేవుడు.
గణపతి లోని గ అంటే జ్ఞానం, ణ అంటే బుద్ధి. గణపతి అయిన దేవుడు బుద్ధిని ప్రసాదిస్తే సిద్ధి తానంతట తానే ప్రాప్తించగలదు. త్రిపురాసురుని సంహరించిన శివుడు, మని శాసనునుడిని నుండి వధించిన పార్వతి దేవి ఇద్దరు కూడా వినాయకుడిని సేవించి విజయం పొందిన వారని భావించాలి.
గణపతి కి వినాయకుడు, లంబోదరుడు, ఏకదంతుడు, గణేశుడు ఇలా దాదాపుగా 108 పేర్లు ఉన్నాయట. అలాగే గణేశుని తొండం ఎడమవైపుకు ఉంటే ఇంట్లో అంతా మంచి జరుగుతుందని చెబుతుంటారు. అలాగే వినాయకుడు సిరిసంపదలను ప్రసాదించేవాడు. వినాయకుని వెనుక భాగం పేదరికంకు తావిస్తుంది. కనుక విగ్రహం వెనుక మొహం మీ బయటి ద్వారాని సూచిస్తున్నట్టుగా ఉంటే మంచిది. వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో దక్షిణ దిశలో కాకుండా తూర్పు లేదా పడమర దిశలలో ఉంచితే మంచిది. ఇంకా స్నానాల గది దగ్గర గాని, ఎట్ల కింద కానీ ఈ విగ్రహం ఉంచరాదు. ఇలా అన్ని పాటిస్తే ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవుడిగా అవతారం ఎత్తిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు గణనాధుని ఆరాధించి తమ పనులను ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోగలిగారు. అలాగే దేవతా సమూహంలో గణపతికి విశిష్టమైన స్థానం ఉంది. అందుచేత భక్తులు 11, 16, 21, 27, 32 వారాల పాటు స్వామి దర్శనం చేసుకొని ప్రదక్షణాలు చేయటం వలన సకల సుఖాలు పొందుతారని పండితులు చెబుతూ ఉంటారు.