మన హిందూ గ్రంధాలలో ఉదయం సాయంత్రానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సూర్యుడు ఉదయించే ముందు సంధ్యా సమయంలో ప్రత్యేక పూజలను చేస్తూ ఉంటారు. ఇకపోతే ఉదయం నిద్ర లేవగానే కొన్ని పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పాలి. మరి ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి పనులు చేయడం వల్ల శుభం కలుగుతుందనే విషయానికి వస్తే…
మన గ్రంథాలలో సూచించిన విధంగా ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూడటం ఎంతో మంచిది.అరచేతులలో లక్ష్మి దేవితో పాటు సరస్వతి విష్ణుమూర్తి కూడా ఉంటారని భావిస్తారు. అందుకే ఉదయం నిద్ర లేవగానే అరిచేతులను చూడటం శుభప్రదంగా భావిస్తారు. ఇలా అరచేతిని చూసిన వెంటనే అరచేతులతో కళ్ళను నమస్కరించాలి. ఇక నిద్రలేచిన వెంటనే మనం మంచం దిగిన వెంటనే భూదేవిని నమస్కరించుకొని మన పనులు ప్రారంభించాలి. భూదేవి మన భారాన్ని మొత్తం మోస్తుంది కనుక భూదేవికి నమస్కరించడం ఎంతో మంచిది.
ఇక మన రోజు వారి కాల కృత్యాలు ముగిసిన వెంటనే స్నానం చేసి సూర్య భగవానుడికి రాగి చెంబులో నీటిని తీసుకుని సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. పూజ చేసే సమయంలో కనకధారా, లక్ష్మి మూలాలను ప్రతిరోజు జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. జీవితంలో ఎల్లప్పుడూ సంపద శ్రేయస్సు కూడా ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఉదయం ఈ పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని చెప్పాలి.కనుక ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే ఈ చిన్న పనులు చేయటం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.