ఆరోగ్య సమస్యల నుండే కాకుండా ఆర్థిక సమస్యల నుండి కూడా విముక్తి కలిగించి బెల్లం..?

సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ బెల్లం తో ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు బదులు బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కారకాలు ఉంటాయి. బెల్లాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగించేవారు. అయితే ఈ బెల్లం ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపటమే కాకుండా ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందే మార్గాన్ని కూడా చూపెడుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం బెల్లం ఉపయోగించి కొన్ని పరిహారాలు చేయటం వల్ల ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒక ఎర్రని బట్టను తీసుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్క తో పాటు కొన్ని నాణేలు కూడా వేసి దానిని మూటలాగా కట్టి పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో ముందు ఐదు రోజులపాటు ఉంచి పూజించాలి. ఇలా ఐదు రోజులు పూజించిన తర్వాత ఆ బెల్లం కట్టిన మూటను ఇంట్లో మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఐదు రోజులపాటు ఉంచాలి. ఇలా పూజించిన బెల్లం మూటను ఐదు రోజుల పాటు ఉంచటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ధన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి బెల్లం పూజించటం చాలా అవసరం.

అలాగే చాలామంది వారు అనుకున్న పనిలో విజయం సాధించడానికి అనేక ప్రయత్నాలు చేసి ఫలితం లభించక విసిగిపోతూ ఉంటారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న పనులు నెరవేరకపోతే బెల్లంతో పరిహారం చేయటం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ పరిహారం చేయటానికి ఏడు బెల్లం ముక్కలు, ఒక రూపాయి నాణెం,అలాగే ఏడు పసుపు కొమ్ములు తీసుకుని ఒక పసుపు గుడ్డలో కట్టి గురువారం రోజున రైల్వే లైన్ దగ్గరకు వెళ్లి మనం చేయాలనుకున్న పనులు నెరవేరాలని మనసులో ఆ దేవుడిని ప్రార్థించి ఆ మూటను రైల్వే లైన్ మీద విసిరేసి అక్కడినుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరుతాయి.