సాధారణంగా మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు దారిలో అప్పుడప్పుడు మనకి రూపాయి రెండు రూపాయల నాణేలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపించిన వెంటనే కొందరు వాటిని తీసుకోవటానికి ఆలోచిస్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో నాణేలతో దిష్టి తీసి వాటిని రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. అలా దిష్టి తీసిన వాటిని తీసుకోవడం వల్ల వారి దరిద్రం మనకి చుట్టుకుంటుందని చాలామంది ప్రజలు రోడ్డు మీద కనిపించిన నాణేలను తీసుకోవటానికి సంకోచిస్తూ ఉంటారు. అయితే ఇలా రోడ్డు మీద కనిపించిన నాణేలను తీసుకోవటం మంచిదా? లేదా? ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రోడ్డుమీద నడిచి వెళ్తున్నప్పుడు నాణేలు కనిపించడం అనేది లక్ష్మి కటాక్షం మనపై ఉందని తెలిపే ఒక సూచన. అందువల్ల రోడ్డు మీద నాణేలు కనిపించటం శుభపరిణామమని వాటిని తీసుకోవటం వల్ల ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవని పండితులు సూచిస్తున్నారు. ఒకవేళ సందేహంతో నాణేలు తీసుకోకుండా వెళితే లక్ష్మీదేవి ని అవమానపరిచినట్లు ఉంటుంది. లక్ష్మీదేవి మనపై చూపించిన కటాక్షాన్ని మనమే తిరస్కరించినట్లు అర్థం. ఇలా చేయటం వల్ల మనం ఎన్ని పూజలు చేసినా కూడా మరల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేము. కావున రోడ్డు మీద ఎప్పుడైనా నాణేలు కనిపిస్తే వాటిని తప్పనిసరిగా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఇలా రోడ్డుమీద దొరికిన నాణేలను తీసుకొని వాటిని పసుపు నీళ్లు, ఆవు పంచితం తో శుద్ధిచేసి వాటిని వాడుకోవచ్చు. లేదా ఇలా రోడ్డుమీద నాణేలు దొరకడం లక్ష్మీ కటాక్షం గా భావించి అలా దొరికిన వాటిని శుద్ధి చేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టి దేవుడి గదిలో ఉంచుకొని పూజించవచ్చు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన ఇంట్లో నిత్యం సిరిసంపదలు నిండుగా ఉంటాయి.