మన హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాంకేతికంగా దేశం ఎంత అభివృద్ధి చెందినా కూడా ప్రజలు వాస్తు శాస్త్రం పట్ల చాలా నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఇప్పటికి కొత్త ఇంటిని నిర్మించుకునే సమయంలో పండితుల సలహాల మేరకు వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు. గృహప్రవేశ సమయంలో కూడా వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లోకి ముందుగా తీసుకెళ్లడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇల్లు మారేటప్పుడు ఏ ఏ వస్తువులను ముందుగా ఇంట్లోకి తీసుకువెళ్తే శుభం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తులసి మొక్క :
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారేటప్పుడు తిధి వారాలు చూసుకోవాలి. అలాగే ఒక ఇంటి నుండి మరొక ఇంట్లోకి అడుగుపెట్టేముందు ముందుగా ప్రకృతి స్వరూపమైన తులసి మొక్కను ఇంట్లోకి తీసుకువెళ్లాలి. తులసి మొక్కను ఇంట్లోకి తీసుకు వెళ్లడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఎల్లప్పుడూ సిరిసంపదలతో తుకుతుగుతారు.
రోలు, రోకలి :
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్లేటప్పుడు రోలు, రోకలి, తిరగలేని కూడా ముందుగా ఇంట్లోకి తీసుకువెళ్లాలి. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించి నాగలితో భూమిని దున్ని పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి భుజించండి అని చెప్పిన బలరాముడు నిజమైన రైతుకు ప్రతినిధిగా వర్ణించారు. అలాగే రోలుని లక్ష్మీదేవి స్వరూపంగా, రోకలి ని నారాయణుడుగా , తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి గా వర్ణించారు. అందువల్ల రోలు రోకలి తిరగలని ఇంట్లోకి ముందుగా తీసుకెళ్లడం వల్ల ధన, ధాన్యాలు సమృద్ధిగా చేకూరుతాయి.
గోవు :
గృహప్రవేశం జరిగే రోజు ముందుగా పూజలు నిర్వహించి ఇంటిలోనికి గోవుని తీసుకువెళ్తారు. శాస్త్ర ప్రకారం ఇలా గోవును ముందుగా తీసుకెళ్లడం శుభప్రదంగా భావిస్తారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటాయని అందువల్ల గోమాతను ముందుగా ఇంట్లోకి తీసుకువెళ్లి ఆ తర్వాత సత్యనారాయణ స్వామి ఫోటోని తీసుకొని కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశిస్తారు.