కార్తీకం చాలా పవిత్రమైనది. ఈమాసంలో నిష్ఠతో శుచితో, శుభ్రతతో ఉండాలి. అయితే సప్తమి నుంచి పౌర్ణమి వరకు ఏం తినాలి? ఏ దేవుడిని పూజించాలో తెలుసుకుందాం…
కార్తీకంలో 7 వ రోజు
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :- ఓం. భాం. భానవే స్వాహా
ఫలితము :- తేజస్సు, ఆరోగ్యం
నిషిద్ధములు :- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు :- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
కార్తీకంలో 8 వ రోజు
పూజించాల్సిన దైవము :- దుర్గ
జపించాల్సిన మంత్రము :- ఓం – చాముండాయై విచ్చే స్వాహా
ఫలితము :- ధైర్యం, విజయం
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు :- తోచినవి – యథాశక్తి
కార్తీకంలో 9 వ రోజు
పూజించాల్సిన దైవము :- అష్టవసువులు – పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా – పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మరక్షణ, సంతాన రక్షణ
నిషిద్ధములు :- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు :- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
కార్తీకంలో 10 వ రోజు
పూజించాల్సిన దైవము :- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము :- ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము :- యశస్సు – ధనలబ్ధి
నిషిద్ధములు :- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు :- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
కార్తీకంలో 11 వ రోజు
పూజించాల్సిన దైవము :- శివుడు
జపించాల్సిన మంత్రము :- ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ
ఫలితము :- ధనప్రాప్తి, పదవీలబ్ధి
నిషిద్ధములు :- పులుపు, ఉసిరి
దానములు :- వీభూదిపండ్లు, దక్షిణ
కార్తీకంలో 12 వ రోజు
పూజించాల్సిన దైవము :- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
నిషిద్ధములు : ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు :- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
కార్తీకంలో 13 వ రోజు
పూజించాల్సిన దైవము :- మన్మధుడు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
ఫలితము :- వీర్యవృద్ధి, సౌదర్యం
నిషిద్ధములు :- రాత్రి భోజనం, ఉసిరి
దానములు :- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
కార్తీకంలో 14 వ రోజు
పూజించాల్సిన దైవము :- యముడు
జపించాల్సిన మంత్రము :- ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము :- అకాలమృత్యువులు తొలగుట
నిషిద్ధములు :- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు :- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
కార్తీకంలో 15వ రోజు
పూజించాల్సిన దైవము – కార్తీకదామోదరుడు, శివుడు, తులసీ, విష్ణువును పూజించాలి.
నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు
జపించాల్సిన మంత్రాలు: ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః
ఇలా పైన చెప్పిన ఆయా దేవతరూపాలను భక్తితో పూజించాలి. అదేవిధంగా నిషేధములు అన్నవాటిని వాడకుండా నిష్ఠతో ఉండాలి.