శ్రీ మహావిష్ణువును సంపదకు సంతోషానికి ప్రత్యేకగా భావిస్తారు. లక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువును పూజించటం వల్ల ఇంట్లో సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా వస్తాయి. అయితే ముఖ్యంగా శ్రీమహావిష్ణువును ఒక ప్రత్యేకమైన మాసంలో పూజించటం వల్ల కొన్ని వేల సంవత్సరాల పాటు శ్రీమహావిష్ణువును పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యచంద్రుల వల్ల కాల విభజన జరుగుతుంది. పౌర్ణమి చంద్రుడు మృగశిరా నక్షత్రం దగ్గర సంచరించడం వల్ల ఈ మాసమును మార్గశిర మాసమని పిలుస్తూ ఉంటారు. సూర్య సిద్ధాంతం ప్రకారం సూర్యుడు ఏ రాశి నందు సంచరిస్తాడో ఆ మాసమునకు ఆ రకమైన పేరు పిలుస్తారు.
ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు ధను రాశిలోకి ప్రవేశించాడు గనుక డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ మధ్య ఉన్నటువంటి మాసమును ధనుర్మాసం ఉంటారు.ఇలా ధనుర్మాసము మార్గశిర మాసంలో రావటం చాలా విశేషం. అందువల్ల ఆ మార్గశిర మాసమునకు చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసము విష్ణువు ఆరాధనకు చాలా పవిత్రమైనది. ధనుర్మాసంలో మహావిష్ణువు ఆలయాన్ని సందర్శించిన వారికి పుణ్యఫలం లభిస్తుంది. ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రపరచుకొని లక్ష్మీదేవి వద్ద ఆవు నెయ్యి తో దీపారాధన చేసిన వారి పై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది.
ధనుర్మాసంలో కనీసం ఒక్కరోజు మహావిష్ణువు ఆలయాన్ని సందర్శించి పూజించటం వల్ల కొన్ని వేల సంవత్సరాలు మహావిష్ణువును పూజించిన ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటూ స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో లేదా దేవాలయంలో మహావిష్ణువును పూజించాలి. అలాగే సాయంత్రం సంధ్యా వేళల్లో శ్రీమహావిష్ణువుకు తులసిదళం సమర్పించి పంచామృతాలతో అభిషేకించి, తులసి శంఖములోని నీళ్లతో స్వామికి అభిషేకం చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చు. పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని నిత్యం ఆరాధించడం వల్ల ఈ మాసంలో శుభకార్యాలు కూడా నిషేధించబడ్డాయి.