దరిద్రం తొలగిపోయి ధనవంతులు కావాలంటే బుధవారం రోజున ఈ పనులు చేయాలి..?

మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా విశిష్టత ఉంది. దేశ ప్రజలందరూ వారంలో ఉన్న ఏడు రోజులను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి కేటాయించి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా సోమవారం రోజున శివుడు మంగళవారం రోజున హనుమంతుడు బుధవారం రోజున గణపతి, గురువారం రోజున సాయిబాబా, శనివారం రోజున శని దేవుడు, ఆదివారం రోజున సూర్య భగవానుడికి పూజలు చేయడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తుంది. అయితే బుధవారం రోజుని గణపతి పూజకు కేటాయించారు. సాధారణంగా ఏ శుభకార్యాన్ని తలపెట్టిన ముందుగా గణపతికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అటువంటి గణపతి కి ప్రత్యేకమైన బుధవారం రోజున ఎటువంటి పనులు చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము.

ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చేసి వాటిని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్న వారు, బుధవారం రోజున ఒకట్టినర్ర పావు పెసలను ఉడికించి అందులో పంచదార, కాస్త నెయ్యి వేసి గోమాతకు తినిపించాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతి బుధవారం ఐదు నుండి ఏడు వారాలు చేయటం వలన అప్పుల నుండి విముక్తి పొందటమే కాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుకుంటారు .

అలాగే కొన్ని సందర్భాలలో ఇంటి వాస్తు దోషం వల్ల కూడా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో రెండు వినాయక విగ్రహాలను తీసుకుని ఇంటి బయట అలాగే లోపల విగ్రహాల వెనక భాగం కలిసే లాగా ముఖద్వారం మధ్యలో ఉంచాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి.

అలాగే ఏదైనా శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు ఇంటి నుండి బయలుదేరే సమయంలో నుదుటిపై వెర్మిలియన్ తిలకం ధరించాలి. అలాగే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. ఒకవేళ మీ దగ్గర ఆకుపచ్చ రంగు దుస్తులు లేకపోతే ఆ రంగు రుమాలు జేబులో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారు.

ఆర్థిక పరిస్థితి బాగాలేని వారు బుధవారం రోజున 21 లేదా 42 జాపత్రి ఆకులను విగ్నేశ్వరుడికి సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. అలాగే బుధవారం రోజున ఆవుకి పచ్చి గడ్డి మేతగా వేయడం వలన మీరు అనుకున్న పనులలో పురోగతి సాధిస్తారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.