శనీశ్వరుడు ఈ పేరు చెప్పగానే ఎంతోమంది భయపడుతుంటారు శని ప్రభావం ఒక్కసారి మనపై కనుక పడింది అంటే ఏడు సంవత్సరాల పాటు ఆ ప్రభావం తొలగిపోదని ఈ ఏడు సంవత్సరాలలో అష్ట కష్టాలను అనుభవించాలని భావిస్తుంటారు. ఇలా శని ప్రభావం మనపై ఒక్కసారి పడింది అంటే ఈ శని ప్రభావ దోషం నుంచి బయట పడాలంటే ఎంతో కష్టతరమైన విషయం అయితే శని మంచి అనుగ్రహం మనపై కనుక ఉంటే రాజ భోగాలను కూడా అనుభవించవచ్చు. ఇకపోతే శనీశ్వరుడు ఎవరి కర్మలకు తగ్గ ఫలితాలను వారికి అందిస్తారు.
మనం తెలిసి తెలియక చేసిన కర్మలకు శనీశ్వరుడు మనం చేసిన కర్మలకు తగ్గ ఫలితాన్ని అందిస్తారు. అందుకే మనం చేసే ఏ పని అయినా ఇతరులకు హాని కలగకుండా ఇతరులను నొప్పించకుండా ఉండాలి. ఇకపోతే శని దేవుడి అనుగ్రహం మనపై ఉండకుండా ఉండాలంటే కొన్ని నియమాలను కూడా పాటించాలి.శని ప్రభావం మనపై ఉండకుండా ఉండాలంటే శనివారం హనుమాన్ చాలీసా చదవడం లేదంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది. అదేవిధంగా సోమవారం శివుడికి బిల్వదలాలతో అభిషేకం చేసిన శని దోషం నుంచి బయటపడవచ్చు.
ఇకపోతే అమావాస్య రోజున తెలిసి తెలియకుండా కొన్ని పనులు చేయడం వల్ల శని ప్రభావం ఎల్లవేళలా మనపై ఉంటుంది. అమావాస్య రోజు మందు మాంసం వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎవరైతే అమావాస్య రోజున ఇలా మందు మాంసం భుజిస్తారో అలాంటి వారిపై శని ప్రభావం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. అందుకే అమావాస్య రోజున మందు మాంసానికి దూరంగా ఉండాలి.ఇక శని ప్రభావం తొలగిపోవాలంటే శనివారం నల్లని నువ్వులు నువ్వుల నూనె లేదా నల్లని వస్త్రాలను దానం చేయడం మంచిది.