లక్ష్మీదేవిని ధనానికి సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ధనవంతులుగా మారటానికి వివిధ రకాల ప్రయత్నాలు చేసి కష్టపడటమే కాకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆమె అనుగ్రహం పొందటానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే డబ్బు సంపాదించడానికి కొంతమంది కష్టపడి పని చేసినప్పటికీ డబ్బు సంపాదించలేకపోతున్నారు. మరి కొంతమంది కష్టపడి పని చేసే డబ్బు సంపాదించినా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చవుతూ ఉంటుంది. ఇలా సంపాదించిన ధనం మొత్తం ఖర్చు అవ్వటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి వాస్తు శాస్త్రం ప్రకారం అనేక పరిహారాలు పూజలు ఉన్నాయి.
అయితే ఇలా ఎన్ని రకాల పరిహారాలు పూజలు చేసినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందకపోవటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అసంతృప్తి చెంది మన ఇంటి నుండి వెళ్లిపోతుంది. అలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. లక్ష్మీదేవి మన ఇంటికి దూరం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డబ్బులు లెక్కించేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కరువై దరిద్రం చుట్టుకుంటుంది.
సాధారణంగా చాలామంది డబ్బులు లెక్కించేటప్పుడు చేతికి ఉమ్ము రాసుకొని డబ్బులు లెక్కిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అతుక్కున్న నోట్లు ఫ్రీగా వస్తాయని డబ్బులు కూడా తొందరగాలెక్కించవచ్చునని ఇలా చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా పొరపాటు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది. కరెన్సీ నోట్లపై ఉమ్మి అంటించడం ఆరోగ్య పరంగా కూడా తప్పు. ఇలా చేయడం లక్ష్మికి ,డబ్బుకు అవమానంగా కూడా పరిగణించబడుతుంది.
అలాగే కొంతమంది ఎప్పుడూ నాణేలు విసిరేస్తూ ఉంటారు. మరి కొంతమంది నోట్లో కట్టలు విసిరిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవిని కూడా అవమానించినట్టు అవుతుంది. అలా చేయడంవల్ల ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ నివసించదు. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా చాలామంది ఎక్కడపడితే అక్కడ డబ్బు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. డబ్బును ఎప్పుడూ కూడా ఒకే స్థానంలో ఉంచాలి.