మనీ ప్లాంట్ పెంచేటప్పుడు మనం చేసే ఈ పొరపాట్ల వల్ల దరిద్రం చుట్టుకుంటుంది…?

money-plant--1200x900

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో సరైన దిశలో సరైన పద్ధతిలో పెంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ధన ప్రాప్తి కలుగుతుంది. అలాంటి మొక్కలలో మనీ ప్లాంట్ కూడా ఒకటి. మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే ధనం కలుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే వాళ్లకు విరుద్ధంగా ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకునేవారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
• వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ నాటేటప్పుడు ఈశాన్య దిశ, అలాగే తూర్పు పడమర దిశలలో కూడా ఈ మొక్కని పొరపాటున కూడా నాటకూడదు. ఈ దిశలో మనీ ప్లాంట్‌ను నాటడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడి విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
• అయితే వాస్తు ప్రకారం, ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ నాటడం మంచిది. ఈ దిశలో ఈ మొక్కను నాటడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
• అలాగే మనీ ప్లాంట్ నాడేటప్పుడు గుర్తుంచుకోవల్సిన మరొక విషయం ఏమిటంటే దాని తీగను నేలపై వ్యాపించకూడదని గుర్తుంచుకోండి.
• నేలపై విస్తరించిన మనీ ప్లాంట్ తీగ ఇంట్లో సానుకూల శక్తికి మంచిది కాదు. దీని వల్ల వాస్తు దోషం పెరుగుతుంది.
• మనీ ప్లాంట్ నాటిన తరువాత, అది వాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
• వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఎండలో ఉంచకూడదు. అందుకే ఇంట్లో సూర్యకాంతి లేని ప్రదేశంలో ఉంచండి.
• వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఎంత పచ్చగా ఉంటే అంత శుభప్రదం. దీని ఆకులు పసుపు రంగులోకి మారితే లేదా ఎండిపోయినట్లయితే, అది అశుభానికి సంకేతం.