క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట ముందు ఈ చిన్న పని చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి?

ఎంతో పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పెద్ద ఎత్తున శివకేశవలతో పాటు తులసిని కూడా పూజిస్తూ ఉంటారు. ఇలా పవిత్రమైన ఈ కార్తీకమాసంలో వచ్చే ద్వాదశి రోజున కొన్ని పనులు చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. అయితే కార్తీకమాసంలో వచ్చే క్షీరాబ్దిద్వాదశి రోజు తులసి కోటముందు ఈ నియమనిష్టలతో పూజ చేయడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పాలి.

కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశనే క్షీరాబ్ధ ద్వాదశి అని పిలుస్తారు. ఈ ద్వాదశి రోజున తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు వివాహం చేయడం ఎంతో మంచిది.విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొని లక్ష్మీదేవిని క్షీరాబ్ది ద్వాదశి రోజున వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తులసి కోటను ఎంతో అందంగా అలంకరించి తులసికోట చుట్టూ ఏ విధమైనటువంటి అపరిశుభ్రత లేకుండా చూడాలి. ఇక ఈ రోజున తులసి కోటలోనే ఉసిరి కొమ్మను నాటి పూజించడం శుభప్రదం.

ఇలా తులసి కోటను అలంకరించిన అనంతరం వరి పిండితో పద్మం ముగ్గును వేసి 27 ఉసిరికాయలపై దీపారాధన చేయాలి.అనంతరం తులసి కోటకు పుష్పాలను సమర్పించి వివిధ రకాల పండ్లు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు. ఇక మనం సంవత్సరంలోఎప్పుడు దీపారాధన చేయకపోయినా క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇలా 27 దీపాలను ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం వల్ల దీప దోషం కూడా తొలగిపోతుందని భావిస్తారు. అయితే ఈ దీపాలను ఆవు నెయ్యితో వెలిగించడం ఎంతో మంచిది.