మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో దేవాలయాలలో పూజలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం లేవగానే వెంటనే శుభ్రం చేసి పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాతనే మిగిలిన పనులు మొదలుపెడతారు. ఇలా ప్రతిరోజు దేవుడిని పూజిస్తూ ఆరాధించడం వల్ల జీవితాంతం సుఖంగా సంతోషంగా జీవించే అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. ప్రతిరోజు దేవుడికి పువ్వులతో అలంకరించి దీపం వెలిగించి, అలాగే దేవుడి ముందు అగరవత్తులు కూడా తప్పనిసరిగా వెలిగిస్తారు. అగర్బత్తీలు వెలిగించకుండా చేసే పూజ అసంపూర్ణం అవుతుంది.
ఇలా ప్రతిరోజు పూజ చేసే సమయంలో అగర్బత్తీలు వెలిగించడం వల్ల ఆ పరిమళ సువాసనకు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా ఇలాగ తరగతిలో వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం లో ఉన్న బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అగర్బత్తి లో నుండి వచ్చే పరిమళ సువాసనకి దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుందని ప్రజల నమ్మకం. అయితే వారంలో రెండు రోజులపాటు అగరబత్తీలను వెలిగించడం మంచిది కాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ప్రతి రోజూ అగరబత్తిని వెలిగించే ఈ అలవాటుని మార్చుకోవాలి. ఎందుకంటే అగరబత్తిని మంగళవారం నాడు ఆదివారం నాడు వెలిగించకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం మంగళ వారం, ఆదివారం ఇంట్లో పూజా చేసినపుడు అగరవత్తులు వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటె ఈ రెండు రోజులలో అగరబత్తిని వెలిగించడం వలన కుటుంబసభ్యుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే ఆర్థిక ఇబ్బందులు తలెత్తటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పును చేయొద్దు. ఇలా ప్రతిరోజు మనం చేసే పూజలు మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.