శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత అందరూ వినే ఉంటారు. అంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ముందుకు నడవాలి అన్నా కూడా శివుడి ఆజ్ఞ ఉండాలి. కైలాస శిఖరాన కొలువై ఉన్న ఆ మహా శివుడి అనుగ్రహం మనపై ఉంటే ఏ పనిలో అయినా విజయం సాధించవచ్చు. అందువల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి సోమవారం రోజు భక్తిశ్రద్ధలతో పూజించాలి. మన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి విముక్తి పొందటానికి పరమేశ్వరుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల సోమవారం రోజున పరమేశ్వరుడిని ఈ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
• సోమవారం రోజున తలంటు స్నానం చేసి పూజ గది శుభ్రం చేసి శివుడి చిత్రపటాన్ని పరిమళగంధంతో కుంకుమతో బొట్టు పెట్టి అందంగా అలంకరించాలి. ఆ తర్వాత పువ్వులు, పండ్లు, నైవేద్యం సమర్పించి దీపం వెలిగించాలి. ఆ తర్వాత శివాష్టోత్తరం చదువుతూ శివుడికి విభూది సమర్పించాలి.
• ఈ శివ పూజలో శివుడికి ప్రీతికరమైన బిల్వపత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. బిల్వపత్రం సమర్పించక పోతే శివ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. అందువల్ల శివ పూజలో బిల్వపత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి.
• అయితే ఈ బిల్వపత్రాలు సమర్పించేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
• బిల్వపత్రం కచ్చితంగా మూడు ఆకులు ఉన్నవి మాత్రమే సమర్పించాలి. రెండో లేదా ఒకటి ఆకులు ఉన్న బిల్వపత్ర అనే శివుడికి సమర్పించడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు.
• అలాగే శివుడికి ఇష్టమైన పరిమళగంధం కూడా సమర్పించాలి.
• ఇక శివ పూజలు ఎటువంటి ప్రసాదం అయినా నైవేద్యంగా పెట్టవచ్చు. కానీ శివుడికి దద్దోజనం సమర్పించటం వల్ల శివుడి అనుగ్రహం పొందవచ్చు.
• అలాగే శివుడికి ఇష్టమైన వెలగపండుని శివ పూజలో సమర్పించడం వల్ల కూడా ఆ శివ అనుగ్రహం లభిస్తుంది.
• ప్రతి సోమవారం ఎలా భక్తిశ్రద్ధలతో శివారాధన చేస్తూ పూజ చేయటం వల్ల ఆయన అనుగ్రహం కలిగి జీవితంలో ఎదురయ్యే సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.