రెండోరోజు అమ్మవారి పూజ ఇలా చేయాలి !

దసరా నవరాత్రులు ఆదివారం రెండోరోజు. ఈ రోజు అమ్మవారిని బాలత్రిపురసుందరిగా ఆరాధిస్తారు.
నవరాత్రులలో అమ్మవారిని రెండోరోజు బాలాత్రిపురసుందరి రూపంలో పూజించాలి. త్రిపురసుందరి అంటే ముల్లోకాలలోనూ అందంగా ఉండేది అని అర్థం.

త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొనవచ్చు. శ్రీచక్రంలో కనిపించే మూడు దేవతలలో బాలాత్రిపుర సుందరి మొదటి దేవత. అందుకే అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకునే సాధకులు ముందు చిన్నపిల్ల రూపంలో ఉండే ఈ బాలాత్రిపుర సుందరి దేవినే పూజిస్తారు. ఈ అమ్మవారి అనుగ్రహంతోనే షోడశ విద్యలు మన సొంతం అవుతాయని నమ్ముతారు.
అమ్మవారిని ఎలా పూజించాలో, దాని వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం…
దుర్గాదేవిని ఈ రోజు లేత గులాబీ రంగు వస్త్రాలతో అలంక రించాలి. వీలైతే మీరు కూడా ఈ రోజు అదే రంగు వస్త్రాలను ధరించాలి. బాలాత్రిపుర సుందరి అష్టోత్తరాన్ని చదువుకొంటూ, ఆ తల్లిని తుమ్మిపూలతో పూజించాలి.
నైవేద్యాలు: ఈ రోజు అమ్మవారికి బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఒకవేళ అష్టోత్తరాన్ని చదువుకోలేని పక్షంలో…