దేవాలయం వెళ్లే ప్రతీ ఒక్కరూ తప్పక తీర్థం స్వీకరిస్తారు. అయితే తీర్థం తీసకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. లేకుంటే దోషాలు కలుగుతాయి. తీర్థం తీసుకునే సమయంలో మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది.
ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కాని అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది. ఇక అదేవిధంగా తీర్థం తీసుకున్నప్పుడు శబ్దం రాకుండా తీసుకోవాలి. లేకుంటే సురాపానం చేసిన ఫలితం వస్తుంది. ఇలా భక్తి, శ్రద్ధలతో తీర్థం స్వీకరించడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయి.