పుణ్య వృక్షాలను ఎలా పూజించాలి?

హిందూమతంలో ప్రకృతి పాత్ర చాలా కీలకం. ప్రకృతిలోని ప్రతీ దానిలో దైవత్వం చూడటం విధిగా భావిస్తారు. అయితే వీటిలో వృక్షాల గురించి పండితులు చెప్పిన విషయాలను తెలుసుకుందాం..

సనాతన ధర్మంలో రావి, మర్రి, మారేడు, తులసీ ఇలా కొన్ని చెట్లు లేదా వృక్షాలను పరమ పవిత్రంగా భావిస్తారు. వాటిని ఎలా ఆరాధించాలో కూడా తెలిపారు. ఆ విషయాలు…

maredu chettu
maredu chettu

జవాబుః 1. రావిచెట్టు 2. మర్రి చెట్టు 3. వేపచెట్టు 4. ఉసిరి చెట్టు 5. తులసి చెట్టు 6. మారేడు చెట్టు 7. అవిశ చెట్టు 8. జువ్వి చెట్టు 9. మోదుగ చెట్టు 10. మామిడి చెట్టు 11. జిల్లేడు చెట్టు 12. వెలగ చెట్టు 13. ఉత్తరేణి చెట్టు 14. పెద్దరేగి చెట్టు 15. నిమ్మచెట్టు

Thulasi Chettu
Thulasi Chettu

ఈ పదిహేను దేవతా వృక్షాలుగా పురాణాలలో చెప్పబడి ఉన్నాయి. ఇవి కనబడినపుడు ప్రదక్షిణం, నమస్కారాలు చేసి అవకాశం ఉన్నప్పుడు పసుపు, కుంకుమ, గంధం, పూలు, దీపం, ధూపం, నైవేద్యం, హారతి ఇవ్వాలి. రావి, మర్రి, వేప, ఉసిరి, తులసి, మారేడు, జువ్వి, వెలగ చెట్లలో అందుబాటులో ఉన్న వృక్షాలకు ప్రతీ రోజూ సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి, దీపారాధన చేసి 9 ప్రదక్షిణలు చేసినచో సకల గ్ర హ బాధలు, గ్ర హచార బాధలు తొలగి పరమాత్మ ప్రసన్నుడై ధర్మార్థ కామములను ప్రసాదించును. ప్రతీ రోజూ వీలులేనినాడు బుధ, గురు, శుక్ర, శనివారాలలో అయినా చేయుట మంచిది. ఈ వృక్ష పూజ కాగానే సద్బ్రాహ్మణునకు గాని, గోవునకు గాని ప్రదక్షిణ చేయుట సర్వాపన్నివారణము కలుగును. ఈ వృక్షాలు అందుబాటులో లేని నాడు గోవునకు, లేదా బ్రాహ్మణునకు లేదా తులసి చెట్టునకు ప్రదక్షిణలు చేసిన సకల కార్యసిద్ధి కలుగుతాయి.