లక్ష్మీ..సర్వజగత్తు ఈ తల్లి అనుగ్రహంతోనే నడుస్తుంది. అందుకే మన పెద్దలు ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అయితే లక్ష్మీదేవి ఎక్కడెక్కడ నివాసముంటుందో మన పెద్దలు చెప్పారు. వాటిలో ఈ రోజు ఏయే చెట్లు, ఏయే పూలలో ఉంటుందో తెలుసుకుందాం…
శ్రీలక్ష్మీ దేవి మామిడి, బిల్వ, కొబ్బరి, అరటి, బంతి, తులసిలలో నివశిస్తుంది. కొబ్బరి, అరటిచెట్టులు ఎంతో ఉపయుక్తమైనవి. అరటి ఆకులో భోజనాలు, అరటిపళ్ళు, అరటికాయ, అరటిపువ్వు ఇలా అరటిచెట్టులో ఉపయోగపడేవి. ఇక కొబ్బరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చెట్టులో అన్ని మనకు ఉపయోగపడేవే. కొబ్బరి చీపిరి ఇంట్లో దారిద్య్రాన్ని పోగుడుతుంది. ఎలా అంటే ఇళ్లు నిత్యం దానితోనే శుభ్రం చేసుకుంటాం కదా.. దీనివల్ల సకలదోషాలు పోతాయి.
ఇర అరటి విషయానికి వస్తే ఇంట్లో ఎటువంటి దైవశుభాకార్యాలలో అయినా అరటిపండు లేకుండా ఉండడు. వసంతంలో వచ్చే మామిడిపూత లక్ష్మీపుత్రుడు అయిన మన్మథుడికి ఎంతో ప్రీతికరమైనది. మామిడి ఆకులతో ఇంటి గుమ్మాలకు తోరణాలు కడతాము. తులసీ దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం అనిపించుకోదు. గుమ్మాలకు బండిపువ్వుల మాలలను కట్టి శ్రీలక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాం. మారేడు పండు, మారేడు పండులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఈ పైన పేర్కొన్న వాటితోపాటు మరికొన్నింటిలో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. కాబట్టి వీటిని పవిత్రంగా భావించి ఉపయోగించుకోవాలి.