మన హిందూ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాంకేతికంగా రోజురోజుకీ దేశం ఎంత అభివృద్ధి చెందుతున్న కూడా ఇప్పటికీ చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రం పట్ల చాలా నమ్మకం కలిగి ఉన్నారు. వాస్తవ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు. వాస్తు నియమాలను పాటించడం వల్ల అనేక సమస్యలు దరిచేరకుండా ఉంటాయి అని పండితులు సూచిస్తున్నారు. అందువల్ల ఇంటిని నిర్మించుకునేటప్పుడు వాస్తు ప్రకారం నిర్మిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వాస్తు ప్రకారం అమర్చుకుంటారు.
వాస్తు నియమాలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించడం వల్ల వాస్తు దోషం ఇంట్లో ఉన్న వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. అలాగే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయి.ముఖ్యంగా ఇంట్లో చెత్త కుండీని ఏర్పాటు చేసే దిశ ఇంట్లో వారి పై ప్రభావం చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చెత్త కుండిని ఈశాన్య దిశలో అసలు ఉంచరాదు. సాధారణంగా ఈశాన్య దిక్కున దేవతలు కొలువై ఉంటారు. అటువంటి దేవతల దిక్కులో చెత్తకుండీని ఉంచటం వల్ల కుటుంబ సభ్యులపై దాని ప్రభావం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈశాన్య దిశలో చెత్తకుండీ ఉంచటం వల్ల వాస్తు దోషం ఏర్పడి కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలతో సతమాతమవుతారు.
అంతే కాకుండా వాస్త నియమాల ప్రకారం తూర్పు, ఆగ్నేయం, ఉత్తరం దిశలలో కూడా చెత్త కుండీ ఉంచరాదు. ఈ దిక్కులలో చెత్తకుండీ ఉంచటం ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించి కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో ఎంతో ఇబ్బంది పడతారు. అందువల్ల ఇంట్లో చెత్తకుండీ ఏర్పాటు చేయటానికి కొన్ని వాస్తవ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం చెత్తకుండీ పెట్టటానికి ఒక ప్రత్యేక దిశ నిర్దేశించి ఉంటుంది. వాస్తు నియమాల ప్రకారం వాయువ్య దిశా లేక నైరుతి దిశలో చెత్తకుండీని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ముఖద్వారానికి ఎదురుగా చెత్తకుండీ ఉండకుండా చూసుకోవాలి.