కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్ ని అమ్మేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. అంత అవసరం ఏమొచ్చిందబ్బా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వయసు పైబడిన కూడా వరుస సినిమాలలో నటిస్తూ దాదాపు సంవత్సరానికి ఐదారు సినిమాలను విడుదల చేస్తూ బిజీ హీరోగా మారిపోయాడు. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ అధిక మొత్తంలో ఆస్తిని కుడబెట్టాడు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ కి ముంబై లోని ఖరీదైన ప్రాంతాలలో కోట్ల విలువ చేసే ఆస్తులు, అపార్ట్మెంట్లు ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా బి టౌన్ లో అక్షయ్ కుమార్ గురించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ముంబైలోని అంధేరీ వెస్ట్, ఈస్ట్, బొరివలీ, ములంద్, జుహు వంటి ఖరీదైన ప్రాంతాలలో అక్షయ్ కుమార్ కి కోట్లు విలువ చేసే రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. అయితే ఇటీవల తనకి ఉన్న ఖరీదైన అపార్ట్మెంట్ లో అంధేరి వెస్ట్‌లో ఉన్న విలాసవంతమైన అపార్ట్మెంట్ ని విక్రయించినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

గతంలో అక్షయ్ కుమార్ అందేరీ వెస్ట్ లో ఉన్న విలాసవంతమైన అపార్ట్మెంట్ ని రూ.4.12కోట్లు రూపాయలకి కొనుగోలు చేశాడు. అయితే ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ ని ప్రముఖ బాలీవుడ్ సింగర్ అయిన అర్మాన్ మాలిక్ తండ్రి దబూ మాలిక్ కి అమ్మినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్ ని రూ.6కోట్లు చెల్లించి దబూ మాలిక్ తన సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌కన్ ట్రయంఫ్ టవర్-1లో ఉన్న ఈ అపార్ట్మెంట్ విస్తీర్ణం1281చదరపు అడుగులు ఉండగా… ఇందులో ఉన్న బాల్కానీ కూడా 59చదరపు అడుగులతో విశాలంగా ఉంటుందని సమాచారం. అయితే అక్షయ్ కుమార్ ఈ అపార్ట్మెంట్ అమ్మటానికి గల కారణం మాత్రం తెలియటం లేదు.