ఇంటి ముందు గుమ్మడికాయని వేలాడదీస్తున్నారా… ఈ తప్పులు అసలు చేయకండి!

సాధారణంగా ఇంటిముందు బూడిది గుమ్మడికాయ కనుక ఉంటే మన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు ప్రభావం నరదృష్టి నరగోష తగలదని పండితులు చెబుతుంటారు అందుకే చాలామంది ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీసి ఉండటం మనం చూస్తుంటాము. ఇలా బూడిద గుమ్మడికాయను వేలాడతీయటం వల్ల ఆ ఇంటి పై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెబుతారు అయితే బూడిద గుమ్మడికాయను కట్టేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

ఇంటికి కట్టే బూడిద గుమ్మడికాయ సాధారణంగా కొన్ని నెలల వరకు చెడిపోదు.అయితే మనం కట్టిన గుమ్మడికాయ కేవలం నెల రెండు నెలల వ్యవధిలోనే చెడిపోయింది అంటే మన ఇంటి పైన దృష్టి ఎక్కువగా ఉందని అర్థం ఇలా ఇంటికి కట్టిన బూడిది గుమ్మడికాయ చెడిపోయింది అంటే వెంటనే దాని స్థానంలో మరొకటి కట్టాలి.ఇలా ఒక దానిని తీసి మరొకటి కట్టేటప్పుడు మన ఇష్టానుసారంగా కట్టకూడదు. సాధారణ గుమ్మడికాయ కదా అని కట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకే గుమ్మడికాయ కట్టేటప్పుడు ఈ నియమాలు పాటించాలి.

శాస్త్ర పరంగా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ వేలాడ తీయటానికి ప్రత్యేకమైన పూజలు చేసి దానిని ఇంటి ముందు వేలాడతీయాలి. ఇలా ఇంటి ముందు కానీ దుకాణాల ముందు కానీ బూడిద గుమ్మడికాయలను వేలాడతీయడం వల్ల నరదృష్టి తగలకుండా ఉంటుంది. నరదృష్టి చాలా ప్రమాదకరమైనది. బూడిద గుమ్మడికాయకు ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఒక శుభ ముహూర్తంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఐశ్వర్య కాళీ ఫోటోతో సహా బూడిద గుమ్మడికాయ వేలాడు తీయడం వల్ల ఆశక్తి మరింత రెట్టింపు అవుతుంది. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు అని అర్థం. ఇది ఇంటి మీద ఇంటి మనుషుల మీద చెడదృష్టి పడకుండా కాపాడుతుంది. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నకారాత్మక శక్తిని కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ నిరోదిస్తుంది.