తూర్పుగోదావరి జిల్లాలో గ్రహణం పట్టణనీ గుడి… ఆ గుడి ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..?

హిందూ పురాణాల ప్రకారం గ్రహణ సమయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ గ్రహణ సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంటి పిల్లలు ఈ గ్రహణ సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఉపవాసాలు చేస్తుంటారు. అంతే కాకుండా ఈ గ్రహణ సమయంలో పట్టువీడుపులు స్నానాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో దేవాలయాలు అన్నీ కూడా మూసివేస్తారు. గ్రహణకాలం తొలగిపోయిన తర్వాత సంప్రోక్షణ చేపట్టి ఆలయాలన్ని శుద్ధి చేసిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు.

పురాతన కాలం నుండి ఈ సాంప్రదాయాలన్నింటినీ ఆచరిస్తూ వస్తున్నారు. సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో దాదాపు దేశంలో ఉన్న ఆలయాలు మొత్తం మూతపడతాయి. అయితే ఈ గ్రహణ సమయంలో కూడా కొన్ని ఆలయాలు మాత్రం తెరిచి ఉంటాయి. ఇలా గ్రహణం పట్టణ ఆలయాలు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయానికి గ్రహణం పట్టదు. అందువల్ల గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని తెరిచి ఉంచి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో గ్రహణం పట్టణ మరొక ఆలయం కూడా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం పట్టణంలో శ్రీ శక్తి పీఠంగా ప్రఖ్యాతి చెందిన ఆలయానికి కూడా గ్రహణం పట్టదు. ఈ ఆలయాన్ని సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో కూడా తలుపులు తెరిచి ఉంచి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

కుక్కుటేశ్వర స్వామి కొలువై ఉన్న పాదగయ పుణ్యక్షేత్రం లో గ్రహణ సమయంలో కూడా గుడి తలుపులు తెరిచి ఉంచి ప్రతిరోజు లాగే యధావిధిగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయం అయిన రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి అష్టాదశ శక్తి పీఠం పురహితిక పురుహూతిక అమ్మవారితో పాటు ఇక్కడ కొలువై ఉన్న స్వయంభు దత్తాత్రేయ స్వామి వారిలను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఇక ఆలయంలో చంద్రగ్రహణం కాలం పట్టు విడుపు స్నానాలు చేసి అభిషేకాలు అర్చనలు లాంటి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.