విహారయాత్రకు బయలుదేరి ప్రమాదంలో పడ్డ కుటుంబం… నిద్రమత్తె కారణమా?

దేశంలో ప్రతిరోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి ప్రయాణాలు చేసే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించమని సూచిస్తున్నారు. కానీ కొంతమంది నిర్లక్షం, అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడి జీవితాంతం అవిటివారిలా బ్రతుకుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాలలోకి వెళితే…ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్‌ బట్నాకర్‌ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని కోకాపేటలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.ఇటీవల తండ్రి, తల్లి, భార్య, కుమారుడితో కలిసి విహార యాత్రకు వెళ్ళటానికి బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విశాఖపట్నానికి కారులో బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం చేరుకున్నారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై గుజరాత్‌ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీని వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వెనుక నుండి మీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది.

లారీని కారు బలంగా ఢీకొట్టడంతో కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో అమిత్‌ తండ్రి సతీష్‌ ప్రసాద్‌ బట్నాకర్‌(79) తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఇక అమిత్ తల్లి, భార్యకు తీవ్రగాయాలు కావడంతో దగ్గర్లోని రాజమహేంద్రవరం లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సరదాగా కుటుంబంతో కలిసి నాలుగు రోజులు విహారయాత్రకు వెళ్లి సంతోషంగా గడపాలని భావించిన వీరు ఇలా అనూహ్య పరిణామాల వల్ల ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహనాన్ని నడిపే సమయంలో నిద్రమత్తులో ఉండటంవల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.