నటి అంజలి గురించి ఎవరికీ తెలియని అసలు నిజాలు ఇవే!

అంజలి ప్రముఖ సినీనటి, మోడల్. 1986లో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదివి తర్వాత చెన్నైలో మకాం మార్చారు. ఉద్యోగరీత తల్లిదండ్రులు వేరే దేశంలో ఉన్నారు. అంజలి డిగ్రీ చదివే రోజుల్లో షార్ట్ ఫిలింలో నటించేది.

మొదటగా తమిళంలో జీవా సరసన నటించింది. అది తెలుగులో రీమేక్ అయిన డేర్ సినిమా. ఇక వరుసగా అడపాదప సినిమాలలో నటిస్తున్న అంజలికి బంపర్ ఆఫర్ లాగా 2011 లో వచ్చిన సినిమా జర్నీ. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2013 లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అచ్చం తెలుగింటి అమ్మాయిలాగా, అమాయకత్వం, చిలిపితనం, కొంటెతనం అన్ని ఈ సినిమాలో చూపించి ఏ పాత్రలోనైనా మెప్పించగలరు అనే గుర్తింపు ఈమె సొంతం.

ఈ సినిమాకు గాను నంది పురస్కారం అందుకుంది. 2008లో విడుదలైన కట్రదు తమిళ్, 2011లో విడుదలైన అంగాడితెరు తమిళ సినిమాలకు ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. 2013లో హోటల్ రూమ్ లో ఉంటున్న అంజలి మిస్ అయి పోలీసుల ముందు ప్రత్యక్షమైంది. తన పిన్ని భారతీదేవి, దర్శకుడు కాలంజియం తనను హింసిస్తున్నారంటూ మీడియాకు తెలిపింది. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతుంది.

అంజలి, జై అనే అబ్బాయిని ప్రేమించిందనీ, ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని సహజీవనం కూడా చేశారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తర్వాత నటి అంజలి ను ఒక స్టార్ డైరెక్టర్ మోసం చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయం బయటకు రాలేదు. ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మొచ్చా,లేదో అస్సలు అర్థం కాదు.

వకీల్ సాబ్ సినిమాలో ఒక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.