దేవతలకు ఈ నైవేద్యాలు పెడితే అనుకూల ఫలితాలు మీ సొంతం !

Get positive result for if make offerings to gods

దేవుడు పూజ చేయడం అనేది నిత్యజీవితంలో ఒక విధి. అయితే స్వామిని ఆరాధించడంతోపాటు ఆయా ఉపచారాలకు సమర్పించాల్సిన వి విధి ప్రకారం చేస్తే ఆయా దేవతా స్వరూపాలు మరింత తొందరగా అనుగ్రహిస్తారని పండితులు పేర్కొంటున్నారు…
లలితాదేవికి.. క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పాలు నైవేద్యం పెట్టాలి.
కలువపూలు, కదంబ పూల మాల వేయవలెను.

Get positive result for  if make offerings to gods
Get positive result for if make offerings to gods

లక్ష్మీదేవికి.. క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజించాలి.

Get positive result for  if make offerings to gods
Get positive result for if make offerings to gods

దుర్గాదేవికి.. మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం. ఎఱ్ఱని పూలమాలతో అలంకరించవచ్చు.

Get positive result for  if make offerings to gods
Get positive result for if make offerings to gods

వినాయకుడికి.. బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం.
శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి.

Get positive result for  if make offerings to gods
Get positive result for if make offerings to gods

శివుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.
సూర్యుడుకు.. మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.
శ్రీ వేంకటేశ్వరస్వామికి.. వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి.
తులసిమాల మెడలో ధరింపవలెను.
ఆంజనేయస్వామికి.. అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజించాలి. వడమాల,తమలపాకులు మాల వేయవలెను.
సత్యనారాయణస్వామికి.. ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం పెట్టాలి. స్వామి అలంకార ప్రియుడు, అన్ని రకాల పూలమాలలు వేయవచ్చు.