పెళ్లిళ్లు నిశ్చయించే గణపతి … ఈ గణపతి విశిష్టత ఏమిటో తెలుసా..?

Taruna Ganapati worship for immediate solution of problems

సాధారణంగా ఎక్కడ అయిన సరే విఘ్నేశ్వరుడిని నాలుగు చేతులతో చూస్తుంటాము. ఏ గుడిలో చూసిన కూడా గణపతిని నాలుగు చేతులతోనే చూసుంటాము. అయితే కర్ణాటక రాష్ట్రం లోని ఇదగుంజి లోని గణపతి కి మాత్రం కేవలం రెండు చేతులు మాత్రమే ఉంటాయి. ఈ ఆలయంలోని గణపతి భక్తులకు రెండు చేతులతో దర్శనమిస్తాడు. ఈ క్షేత్రం వినాయకుడు కోరి వేసిన క్షేత్రంగా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రం ఉత్తర కర్ణాటకలోని హెన్నవరలో ఉంది. ఈ ప్రాంతం శరావతి నది అరేబియా మహాసముద్రం లో కలిసే చోట ఉంది. విఘ్నాలు తొలగించే గణపతిని ఇక్కడి ప్రజలు పెళ్లిళ్లు కాయం చేసే గణపతిగా కొలుస్తారు. దేవుడిని 1500 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారు అని అంటారు.

అన్ని చోట్ల ఏకదంతం, నాలుగు చేతులు, ఎలుక వాహనంతో దర్శనమిచ్చే గణపతి, ఇడగుంజి లో మాత్రం ఇవేవీ లేకుండా భక్తుల కోరికలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ గుడిలో మాత్రం వినాయకుడి వద్ద ఎలుక కూడా ఉండదు. అలాగే రెండు దంతాలు ఉంటాయి. అంతేకాకుండా స్వామి ఒక చేతిలో పద్మం, మరొక చేతిలో లడ్డు ప్రసాదంతో దర్శనమిస్తుంటారు. ఈ గుడి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ స్వామివారి అనుగ్రహం లేనిది పెళ్లి ప్రయత్నాలు కూడా చేయరు అనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. మరికొందరు అయితే పెళ్లి సంబంధం కుదరగానే ఇరువైపుల పెద్దలు వచ్చి రెండు చీటీలను తీసుకువచ్చి స్వామివారి చెంత ఉంచుతారు. ఇందులో కుడివైపు చీటీ కింద పడితే స్వామిని వారి అనుమతి కలిగినట్టు భావిస్తారు. లేదు అంటే మరో ఆలోచన లేకుండా ఇంకొక సంబంధం వెతుక్కుంటారు.

ఇక్కడ కేవలం పెళ్లిళ్లకు మాత్రమే కాకుండా… కొందరు భక్తులు కేశవ కారం తలపెట్టిన మొదటగా స్వామివారి అనుమతి తీసుకుంటారట. ఇక్కడ స్వామివారికి రోజు చేసే పూజలు, నైవేద్యాలతో పాటు పంచఖాధ్య పేరుతో ప్రత్యేకంగా ప్రసాదం చేసి స్వామివారికి నివేదిస్తారు. వినాయక చవితి తో పాటు ఇతర పర్వదినాలను పురస్కరించుకొని స్వామివారికి ఏడాది పొడవునా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ ఒక విశేషం.
విశ్వకర్మ స్వామి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాడని….. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయ నిర్మాణం చేశారని చెబుతుంటారు.