Food Eating Rules: వంట చేసే సమయంలో తినే సమయంలో ఈ నియమాలు పాటించకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

మామూలుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. అందుకే అన్నం విషయంలో ఎన్నో రకాల నియమాలు జాగ్రత్తలు పాటించాలని చెబుతూ ఉంటారు. అయితే సనాతన ధర్మంలో ఆహారాన్ని దైవంగా భావించి పూజలు చేసేవారు. అంతేకాకుండా ఆహారం తీసుకునే సమయంలో వంట చేసే సమయంలో అనేక రకాల నియమాలను పాటించేవారు. ఎవరైతే ఆహారాన్ని గౌరవించి ఇంట్లో వండుకొని నియమానుసారంగా భుజిస్తారో వారికి పగలు రెట్టింపు పుణ్యం, రాత్రికి నాలుగు రెట్లు పుణ్యఫలం లభిస్తాయి. మనం తినే ఆహారాన్ని దైవంగా భావించే ఇంట్లో అన్నపూర్ణా దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.

ఆ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు. కాగా హిందూ విశ్వాసం ప్రకారం ఆహారాన్ని వండేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఆహారాన్ని తయారు చేసే ముందు శరీరం శుభ్రంగా మనస్సు స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఇష్టంగా సంతోషంగా వంట చేయాలి. నిర్మలమైన హృదయంతో ఆహారాన్ని తయారు చేయాలి. వంట చేసే ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. అటువంటి వారి ఇంట్లో నివసించే వారిపై అన్నపూర్ణదేవి ఆశీస్సులు తప్పక లభిస్తాయి. భోజనం చేసే ముందు చదవాల్సిన మంత్రం.. ఓం సః నవవతు । సః నౌ భునక్తు । సః వీర్యం కరవావహై । తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై । ఓం శాంతిః శాంతిః శాంతిః..

భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని ఎప్పుడూ అవమానించకూడదు. ఎల్లప్పుడూ కుడిచేత్తో ఆహారం తీసుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎడమచేతితో తినడం పాపంగా పరిగణించబడుతుంది. ఇలా ఎడమ చేతితో అన్నం తిన్న వారు జీవితంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే హిందూ విశ్వాసం ప్రకారం ఆహారం ఎల్లప్పుడూ నేలపై కూర్చొని తినాలి. ఆహారం ఎంత తినగలిగితే అంత మాత్రమే తినే ప్లేట్ లో పెట్టుకోవాలి. ప్లేట్‌లో పెట్టుకున్న ఆహారాన్ని ఎప్పుడూ వదల కూడదు. మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు లేదా తినే కంచంలో చేతిని శుభ్రం చేసుకోరాదు. ఇలా చేసేవారి ఇంట్లో డబ్బుకు, తిండికి కొరత ఏర్పడుతుంది. ప్రతి వారి శరీరం, మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. ప్రశాంతంగా తినాలి. భోజనం చేస్తూ గొడవ పడితే అన్నపూర్ణ దేవి ఆగ్రహానికి గురవ్వక తప్పదు..