ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా… కారణం ఇది కావచ్చు!

సాధారణంగా ప్రతి ఒక్కరీ జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా కీలకంగా ఉన్నటువంటి డబ్బును సంపాదించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇలా ఎంత కష్టపడినప్పటికీ డబ్బు మాత్రం నిలవకపోవడం వల్ల కొన్ని వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. కష్టపడిన డబ్బు మన చేతిలో నిలబడకపోతే చాలామంది వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ఆవరణంలో మనీ ప్లాంట్ పెట్టుకోమని చెబుతుంటారు. ఇలా మనీ ప్లాంట్ ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే చాలామంది ఇంటి ఆవరణంలో మనీ ప్లాంట్ ఉన్నప్పటికీ ఆర్థికంగా పెద్దగా ఎదుగుదల లేకపోయినా అలాంటి ఆర్థిక ఇబ్బందులతోనే కష్టపడుతూ ఉంటారు.ఇలా మనీ ప్లాంట్ ఉన్నప్పటికీ మీరు కష్టపడి పని చేస్తూ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు కనక వెంటాడుతుంటే మనీ ప్లాంట్ విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కారణమని చెప్పాలి. మనీ ప్లాంట్ ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల మన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు ప్రభావం పడకుండా ఉండడమే కాకుండా మన ఇంటిపై ఎప్పుడూ కూడా అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పిస్తుంది.

ఇలా మన ఇంటికి అనుకూల పరిస్థితులను కల్పించే మనీ ప్లాంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున మనీ ప్లాంట్ ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలో నాటకూడదు. ఇలా ఈశాన్య దిశలో నాటడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా మనీ ప్లాంట్ వల్ల మనకు అన్ని ప్రయోజనాలు కలగాలి అంటే ఎప్పుడూ కూడా ఈ మొక్కను ఆగ్నేయ దిశలో నాటడం మంచిది.ఇలా మనీ ప్లాంట్ ఆగ్నేయ దిశలో ఉంటే ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ ప్లాంట్ ఎలా పెరిగితే మన ఇంట్లో కూడా సంపద అలాగే పెరుగుతుంది. ఇక మనీ ప్లాంట్ తో పాటు తమలపాకును కూడా కలిపి పెంచడం వల్ల ఇక లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపైనే ఉంటాయని చెప్పాలి.