ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఇంటికే అందం పెరుగుతుంది. అయితే అది సరిగా పెరుగక వాడిపోతే మాత్రం చాలా మందికి అసహనంగా ఉంటుంది. ఇప్పుడు దానికి సరళమైన పరిష్కారం గురించి తెలుసుకుందాం. దీనికి ఎలాంటి ఖర్చు లేకుండా, ఇంట్లోనే లభించే కొన్ని సహజ పదార్థాలతో మనీ ప్లాంట్‌ను తిరిగి పచ్చగా, ఆరోగ్యంగా మార్చేయొచ్చు. ఈ చిట్కాలు కేవలం మొక్కనే కాదు… మీ ఇంటి వాతావరణానికే కొత్త శక్తిని తీసుకొస్తాయి అదేంటో తెలుసుకుందాం.
మనీ ప్లాంట్‌కి ఉత్తమ సహజ టానిక్‌గా పనిచేసే పదార్థం బియ్యం కడిగిన నీరు. ఈ నీటిలో ఉండే విటమిన్ బి, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి పుష్కల పోషకాలు మొక్కకు అద్భుతమైన శక్తిని అందిస్తాయి. ఒక శుభ్రమైన పాత్రలో మొదటి కడిగిన బియ్యం నీటిని భద్రపరచి, దానిని 7 రోజులు నిల్వ ఉంచితే అది పులియడం ద్వారా పుష్కల పోషకాలతో నిండి సూపర్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా మారుతుంది. ఆ తర్వాత, 5 రెట్లు నీటిని కలిపి ద్రావణంగా తయారుచేసి మొక్క వేర్లలో పోస్తే… మొక్క అద్భుతంగా పెరుగుతుంది.
ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఆకులపై స్ప్రే చేస్తే, కీటకాలు దూరమవుతాయి. అలాగే, బెల్లం నేలలో సూక్ష్మజీవుల ఉనికిని పెంచి వేర్లను బలపరుస్తుంది. టీ పొడి నీరు ఆకులకు నిగారింపు ఇస్తుంది. కీటకాలు బాధిస్తే పసుపు పొడి ఒక సహజమైన ఔషధంలా పనిచేస్తుంది. ఈ అన్ని చిట్కాలు తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. మనీ ప్లాంట్ ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఫెర్టిలైజర్లు అవసరం లేదు. సరైన జాగ్రత్తలు, ఇంట్లో లభ్యమయ్యే సహజ పదార్థాలతో మీ గ్రీన్ కవర్ పచ్చగా అద్భుతంగా కనిపిస్తుంది.
