పొరపాటున కూడా మంగళవారం ఈ పనులు చేయకూడదు.. చేస్తే అంతే సంగతులు?

సాధారణంగా మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రీతికరంగా భావించి ఆ రోజున ప్రత్యేకంగా ఆ దేవుడికి పూజలను నిర్వహిస్తూ ఉంటారు.సోమవారం పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలను చేయగా మంగళవారం హనుమంతుడికి పూజలు చేస్తారు అలాగే బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా ఇలా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేస్తాము. అయితే మంగళవారం ఆంజనేయస్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తాము.ఇలా మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించి హనుమంతుడి అనుగ్రహం మనపై ఉండాలని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాము.

ఇకపోతే మంగళవారం మన శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పనులను చేయడం నిషేధంగా భావిస్తారు ఈ క్రమంలోనే పొరపాటున కూడా అలాంటి పనులను మంగళవారం చేయకూడదని చెబుతుంటారు. ఒకవేళ చేస్తే కనుక ధన నష్టం అనారోగ్య సమస్యలు లేదా ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. మరి మంగళవారం ఎలాంటి పనులను నిషేధించాలి.. ఏ పనులు చేయకూడదనే విషయానికి వస్తే..

మంగళవారం అంగార గ్రహానికి ఎంతో ప్రీతికరమైన రోజు. అంగారకుడు ఎరుపు రంగులో ఉంటారు కనుక రక్తాన్ని సూచిస్తుంది. అందుకే మంగళవారం ఎప్పుడూ కూడా జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు.ఇవన్నీ పదునైన వస్తువులు కనుక గోర్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం వల్ల కొన్ని సార్లు ప్రమాదం జరిగి రక్తం చిందించాల్సి ఉంటుంది. అదేవిధంగా మంగళవారం యజ్ఞాలు చేయకూడదు. ఇక మంగళవారం ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఎంతో శుభప్రదం. మంగళవారం పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. అదేవిధంగా మంగళవారం ఇనుప వస్తువులను కూడా కొనుగోలు చేయకపోవడం మంచిది.