దారిలో కనిపించే ఈ వస్తువులను పొరపాటున కూడా తాకకూడదు..?

సాధారణంగా మనం రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు అనేక రకాల వస్తువులు రోడ్డుమీద కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో రోడ్డు మీద కనిపించే కొన్ని వస్తువులను ముట్టుకోకపోవడమే కాకుండా వాటికి ఆమడ దూరంలో నడిచి వెళ్ళాలి. పొరపాటున అలాంటి వస్తువులను దాటుకొని వెళితే దరిద్రం చుట్టుకుంటుంది. అయితే రోడ్డుమీద కనిపించే ఎలాంటి వస్తువులకు మనం దూరంగా ఉండాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా దిష్టి తీసిన వస్తువులను రోడ్డు మీద పారేస్తూ ఉంటారు. ఎండు మిరపకాయలు, వెంట్రుకలు, నిమ్మకాయలు, నాణేలు వంటి వస్తులతో దిష్టి తీసి వాటిని రోడ్డు మీద పారేస్తూ ఉంటారు. ఇలా దిష్టి తీసిన వస్తుల మీద దాటుకొని వెళ్ళటం వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వెంట్రుకలను చూడటం అశుభం గా భావిస్తారు. వెంట్రుకల కుచ్చుల మీద దాటుకొని వెళ్ళటం వల్ల రాహువు ప్రభావితమవుతాడు. అందుకే వెంట్రుకల కుచ్చులను దాటుకొని వెళ్లకూడదు.

అలాగే రోడ్డుమీద నిమ్మకాయ, మిరపకాయలు ఉంటే వాటికి దూరం జరిగి నడిచి వెళ్ళాలి. ఎందుకంటె దిష్టి తీసి, చేతబడి చేసి వాటిని రోడ్డుపై పడేసి ఉండొచ్చు. ఇలా వాటిని దాటుకొని వెళ్ళటం వల్ల వారి దరిద్రం మనకి చుట్టుకుంటుంది. అలాగే బూడిద లేదా కాలిన కట్టెలు రోడ్డుపై కనపడితే వాటిని దాటకూడదు. ఇలాంటివి ప్రతికూల శక్తిని కూడా విడుదల చేస్తుంది. వీటిని దాటడం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దారిలో చనిపోయిన జంతువు కనిపిస్తే.. వెంటనే దిశ మార్చుకోవాలి. జంతువు యొక్క మృతదేహాన్ని దాటడం ద్వారా మీ జీవితంలోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.