సాధారణంగా మనం ఎంతోమంది దేవదేవతలను పూజిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే శనీశ్వరుడికి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ శని దేవుడిని కూడా పెద్ద ఎత్తున పూజిస్తారు.అయితే గ్రహాలలో ఒకటిగా ఉన్నటువంటి శని గ్రహాన్ని శని దేవుడుగా భావించి పూజిస్తాము. ఇలా శని దేవుని అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి ఏ విధమైనటువంటి శని ప్రభావ దోషం ఉండకుండా చూడమని శని దేవుడికి పూజిస్తాము. అయితే శని దేవుడిని శనీశ్వరుడు అని పిలుస్తుంటారు ఇలా శని గ్రహాన్ని శనీశ్వరుడు అని పిలుచడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
మన హిందూ ధర్మం ప్రకారం తొమ్మిది గ్రహాలు ప్రతి ఒక్క రాశిలోనూ గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే మిగిలిన గ్రహాలతో పాటు శని గ్రహం కూడా ప్రతి ఒక్క రాశిలోనూ సంచరిస్తూ ఉంటుంది. శని దేవుడిని శనీశ్వరుడు, శనేశ్చరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు..శని చరుడు..దీని అర్థం నెమ్మదిగా చలించేవాడు అని అర్థం అందుకే మిగిలిన గ్రహాలతో పోలిస్తే శని గ్రహం మన రాశిలో ఉన్నప్పుడు నెమ్మదిగా చెల్లిస్తూ ఉంటుంది.అందుకే ఒక్కసారి శని ప్రభావం మనపై పడితే సుమారు రెండున్నర సంవత్సరాల పాటు శని ప్రభావ దోషం మనపై ఉంటుందని భావిస్తారు.
ఇక శని దేవుడిని శనీశ్వరుడు అని పిలవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. శనీశ్వరుడిలో ఈశ్వర నామం ఉంటుంది. మనం బోలా శంకరుడిని ఎలాంటి ఆపదలోనైనా ఈశ్వర అని స్వామి వారిని పూజిస్తే ఆ ఆపదల నుంచి మనల్ని రక్షిస్తారని భావిస్తారు. అదేవిధంగా శని దేవుడు ఈశ్వర అంశం కనుక శని దేవుడిని శనీశ్వరుడని పిలుస్తారు.అందుకే మనం ఏదైనా ఆపద సమయంలో శనీశ్వరుడిని పూజించిన ఆపదల నుంచి మనల్ని రక్షిస్తాడని భావిస్తారు. అయితే శని దేవుడిని ఎప్పుడూ కూడా శని అని పిలవకూడదు తప్పనిసరిగా శనీశ్వరుడు అని పిలవడం వల్ల శని దేవుడితో పాటు ఆ ఈశ్వరుడి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది.